‘ఏమైనదో..’ మిస్టర్‌ మజ్ను తొలి పాట | Akhil Akkineni Mr Majnu First Single Yemainado | Sakshi
Sakshi News home page

Published Fri, Dec 14 2018 10:26 AM | Last Updated on Sun, Jul 14 2019 10:21 AM

Akhil Akkineni Mr Majnu First Single Yemainado - Sakshi

అక్కినేని యువ కథానాయకుడు అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మిస్టర్ మజ్ను. తొలి రెండు సినిమాలు నిరాశపరచటంతో అఖిల్ ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. వెంకీ అ‍ట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సవ్యసాచి ఫేం నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్‌. తాజాగా తొలి పాటను విడుదల చేశారు.

ఏమైనదో అంటూ సాగే ప్రణయ గీతం సినిమా మీద మంచి హైప్‌ క్రియేట్ చేస్తోంది. తమన్‌ సంగీత సారధ్యంలో అర్మాన్‌ మాలిక్‌ ఆలపించిన ఈ గీతానికి శ్రీమణి సాహిత్యమందించారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను జనవరిలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement