Prabhusalman
-
ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చింది
‘‘మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్లిపోతాం. ఇక్కడ్నుంచి ఏమీ తీసుకెళ్లలేం అనే విషయం అందరికీ తెలుసు. ఇదే విషయాన్ని నాకు ఏనుగు మరోలా చెప్పింది. ఈ ప్రకృతిలో నువ్వు ఒక భాగం. ఈ భూమిని నువ్వు చూసుకుంటే అది మళ్లీ నిన్ను చూసుకుంటుందని. ఈ చిత్రం నన్ను పూర్తి మనిషిగా మార్చేసింది’’ అని రానా అన్నారు. రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, శ్రియా పింగోల్కర్, జోయా హుస్సేన్ ప్రధాన పాత్ర«ధారులు. ఈ నెల 26న రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్య క్రమంలో రానా మాట్లాడుతూ– ‘‘సిటీలో పెరిగిన ఓ కుర్రాడు ప్రకృతికి, మనుషులకు జరిగిన పోరాటంలో ఏనుగులను రిప్రజెంట్ చేస్తూ.. వాటిని ఎలా రక్షించాడు? అనే కథతో ‘అరణ్య’ను రూపొందించాం’’ అన్నారు. ‘‘ఐదేళ్లుగా ఏడాదికి 800 ఏనుగుల వరకూ మరణిస్తున్నాయి. దీనికి అడవుల విస్తీర్ణం తగ్గడం ఓ కారణం. రానా ఇందులో ఏనుగుల గొంతుకగా కనిపిస్తారు’’ అన్నారు సాల్మన్ . ‘‘ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు ఈరోస్ ప్రతినిధి నందు అహూజా. -
పాటతో ముగింపు!
జస్ట్... మూడంటే మూడే రోజులు షూటింగ్ జరిపితే వరుణ్ తేజ్ ప్రేమకథ కంప్లీట్ అవుతుందట. వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘తొలి ప్రేమ’. ఇందులో రాశీ ఖన్నా కథానాయిక. ‘‘షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది. వైజాగ్‌లో జరుపబోయే మూడు రోజుల సాంగ్ షూట్‌తో మూవీ కంప్లీట్ అవుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌ను సార్ట్ చేశాం’’ అని యూనిట్ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... తమిళ డైరెక్టర్ ప్రభు సాల్మన్ దర్శకత్వంలో బందేవ్ పాత్రలో రానా నటిస్తున్న సినిమా ‘హాథీ మేరే సాథీ’. ఇందులో వరుణ్ తేజ్ కూడా కీలక పాత్ర చేయనున్నారట. ‘‘హాథీ మేరే సాథీ’లో రానా, వరుణ్ తేజ్ పాత్రలకు ఈక్వెల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. కోట శ్రీనివాసరావుగారు ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించి తమిళ్లో డబ్ చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు సాల్మన్. అంతేకాదు.. ఈ నెల 25 నుంచి మార్చి వరకు ఈ సినిమా షెడ్యూల్‌ను థాయ్‌ల్యాండ్‌లో ప్లాన్ చేశారట చిత్రబృందం. ఆ తర్వాత కేరళలో కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. -
ఇకపై చిత్ర నిర్మాణం చేపట్టను
ఇకపై సొంతంగా చిత్రాలు తీయనని ప్రముఖ దర్శకుడు ప్రభుసాల్మన్ పేర్కొన్నారు. మైనా, కుంకీ వంటి విజయవంతమైన చిత్రాల దర్శకుడైన ఈయన తాజా చిత్రం తొడరి ఆశించిన విజయం సాధించలేదు. కాగా ప్రభుసాల్మన్ నిర్మాతగా తన గాడ్ ఫిక్చర్స్ పతాకంపై రూపొందించిన చిత్రం రూపాయ్.ఆర్పీకే.ఎంటర్టెయిన్మెంట్ సంస్థ అధినేత ఆర్.రవిచంద్రన్ సహనిర్మాతగా వ్యవహరించిన ఈ చిత్రంలో కయల్ ఫేమ్ చంద్రన్, ఆనంది హీరోహీరోయిన్లుగా నటించారు. కిషోర్వ్రిచంద్రన్, చిన్నిజయంత్, హరీష్‌ఉత్తమన్, ఆర్ఎన్ఆర్, మనోహర్, మారిముత్తు, వెట్రివేల్రాజా ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి అన్భళగన్ దర్శకత్వం వహించారు. డి.ఇమాన్ సంగీతాన్ని అందించిన ఈ చిత్ర ఆడిమో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు మాట్లాడుతూ తన తొలి చిత్రం సాటైట్ తరహాలోనూ ఇదీ వైవిధ్యంగా ఉంటుందన్నారు. అయితే కథ, కథనాలు మరో కోణంలో ఉంటాయని తెలిపారు. డబ్బు మోహం ఎలాంటి సమస్యలకు కారణం అవుతుందనే ఇతివృత్తంతో తెరకెక్కించిన చిత్రం రూపాయ్ అని వివరించారు. అనంతరం చిత్ర నిర్మాత దర్శకుడు ప్రభుసాల్మన్ మాట్లాడుతూ ఇంతకు ముందు తాను నిర్మించిన సాటైట్ చిత్ర సాటిలైట్ హక్కులే 1.25 కోట్లకు అమ్ముడు పోయాయన్నారు. అలాంటిది ఈ చిత్రం శాటిలైట్ విక్రయణే జరగలేదని చెప్పారు. ఇకపై తాను నిర్మాతగా చిత్రాలు చేయనని చెప్పారు. కారణం ప్రస్తుత పరిస్థితి అంత దయనీయంగా ఉందని వ్యా ఖ్యానించారు. ఈ చిత్రాన్ని ఈ 5 జేకే.గ్రూప్స్ అధినేత డా.జే.జయక్రిష్ణన్, కాస్మో విలేజ్ శివకుమార్ కలిసి ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. -
ఆ చిత్రంలో నటించడం అదృష్టం
పేరళగి చిత్రంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు నటి అమిత తెలిపారు. శివ ప్రదీప్, సునులక్ష్మి, అమితలతో దర్శకుడు ప్రభుసాల్మన్, లివింగ్స్టన్ నటిస్తున్న చిత్రం పేరళగి. మీడియ మాస్టర్స్ ఆధ్వర్యంలోఎస్జే ఎడ్వర్డ్ రాజ్ నిర్మిస్తున్నారు. ఛాయూగ్రహణం అరుణ్, సంగీతం చాణక్య, పాటలు సేహ్నన్, యుగభారతి, దర్శకుడిగా ఎస్జే దళపతి రాజ్ ఈ చిత్రానికి పని చేస్తున్న చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, ఒక తప్పుడు మెడికల్ రిపోర్టు, ఒక చురుకైన యువకుని జీవితాన్ని, అతని ప్రేమను ఏ విధంగా చిన్నాభిన్నం చేసేందనేదే ఈ చిత్ర కథ. వైద్య రంగంలో జరిగే కొన్ని నిర్లక్ష్య సంఘటనల ఆధారంగా ఈ చిత్ర కథను రాశానని తంజావూరులో షూటింగ్ జరిగిందన్నారు. పేరళగి...పేరళగి, ఎత్తనై, ఎత్తనై పాటలను తాను రచించానని, తవమిండ్రి కిడైత్త వరమె అనే పేరుతో రూపొందిన ఈ చిత్రానికి పేరళగి అనే టైటిల్ సరిగ్గా కుదిరినందున మార్పు చేశానన్నారు. వచ్చే నెల ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు.