
అరుణ్ రాహుల్, అంజన
అరుణ్ రాహుల్, అంజన జంటగా కట్ల రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో కేజే రాజేశ్ నిర్మిస్తున్న చిత్రం ‘చేతిలోన చెయ్యేసి చెప్పు బావా’. ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా అరుణ్ రాహుల్ మాట్లాడుతూ – ‘‘తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేశాను. ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాను. తెలుగు పరిశ్రమలో నా ప్రయత్నాన్ని సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.
‘‘నిర్మాతగా నా తొలి సినిమా ఇది. కథ కూడా నేనే అందిస్తున్నాను. కచ్చితంగా మంచి సినిమాను అందిస్తాం అనే నమ్మకముంది’’ అన్నారు నిర్మాత. ‘‘రాజేశ్ మంచి కథను అందించారు. ప్రేమను దక్కించుకోలేని జంట మరో జన్మలో ఎలా విజయం సాధించారన్నది కథాంశం. సమ్మర్‌లో విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు దర్శకులు. ఈ సినిమాకు సంగీతం: పార్థసారధి, కెమెరా: వేణు మురళీధరన్.
Comments
Please login to add a commentAdd a comment