ప్రభాస్ 'కల్కి' రిలీజై దాదాపు నెలరోజులు కావొస్తుంది. అయితేనేం తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ చెప్పుకోదగ్గ సినిమాలేం లేకపోవడంతో ఇప్పటికే విజయవంతంగా రన్ అవుతూనే ఉంది. మరీ ముఖ్యంగా మహాభారతం సీన్లు బాగా వర్కౌట్ అయ్యాయి. వీటికోసమే జనాలు మాట్లాడుకుంటున్నారు కూడా. ఇప్పుడు ఈ సన్నివేశాల విషయమై చిత్రబృందానికి కల్కి ధామ్ పీఠాధిపతి నుంచి లీగల్ నోటీసులు వచ్చాయి.
(ఇదీ చదవండి: శ్రీ కృష్ణుడు vs నరకాసుర.. టీజర్ కాని టీజర్)
'కల్కి' సినిమా హిందువులు మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆరోపించిన ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ చిత్రబృందంతో పాటు ప్రధాన పాత్రధారులైన ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌కు నోటీసులు పంపారు. కల్కి పుట్టుకని తప్పుగా చూపించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృత్రిమ గర్భంలో కల్కి జన్మించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
'మన పురాణాల్లో ఉన్న వాటికి ఈ సినిమా విరుద్ధంగా ఉంది. మతపరమైన మనోభావాలు కించపరిచేలా ఉంది. అందుకే మేం అభ్యంతరాలు చెప్పాం. స్పందన కోసం వేచి చూస్తున్నాం. కల్కి భగవానుడి కాన్సెప్ట్‌నే ఈ సినిమా మార్చేసిందని, ఇలా చేయడం పురాణాలని అగౌరపరచడమే. దీని వల్ల పురాణాలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది' అని ఆచార్య ప్రమోద్ కృష్ణమ్ తన నోటీసుల్లే పేర్కొన్నారు.
(ఇదీ చదవండి: మెగా- అల్లు ఫ్యామిలీకి గొడవలు.. నిర్మాత ఏమన్నారంటే?)
Comments
Please login to add a commentAdd a comment