తనుశ్రీ దత్తా - నానా పటేకర్ (ఫైల్ ఫోటో)
ముంబై : గత కొన్ని రోజులుగా తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం బాలీవుడ్‌ను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ‘హార్న్ ఓకే ప్లీజ్’ చిత్రీకరణ సమయంలో నానా పటేకర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ తనుశ్రీ దత్తా ఆరోపించారు. ఆ అనంతరం తనుశ్రీ ఆరోపణలు హిందీ చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనుశ్రీకి మద్దతుగా బాలీవుడ్ నటుడు, నటీమణులు ఒక్కొక్కరూ గళం విప్పారు. ప్రస్తుతం తనుశ్రీ చేస్తున్న ఆరోపణలపై నానా పటేకర్ లీగల్ నోటీసులు పంపారు. తనుశ్రీ చేస్తున్న ఆరోపణలు అసత్యమైనవని, పూర్తిగా అవి తప్పుడు ఆరోపణలంటూ పటేకర్ న్యాయవాది రాజేంద్ర శిరోద్కర్ చెప్పారు. ఆమెకు లీగల్ నోటీసులు పంపినట్టు తెలిపారు. ఈ నోటీసుల్లో ఆమె చేస్తున్న ఆరోపణలకు క్షమాపణలు చెప్పాలని ఉన్నట్టు రాజేంద్ర శిరోద్కర్ ధృవీకరించారు. ‘ఇప్పుడు తనుశ్రీ ఇలా ఎందుకు మాట్లాడుతుందో తెలియదు. కానీ ఏమో కారణాలు ఉండి ఉంటాయి. నానా ఈ రోజు లేదా రేపు ముంబైకి వస్తారు. వచ్చిన వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. రేపు కచ్చితంగా నానా ఇక్కడ ఉంటారు’ అని శిరోద్కర్ చెప్పారు.
మరోవైపు తనుశ్రీ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతూ వస్తోంది. సెట్స్‌లో జరిగిన వాటిపై తనుశ్రీ చెబుతున్న విషయాలకు సంబంధించి, ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. తనుశ్రీ చెప్పిన విషయాలే ఆ వీడియోలో ఉండటం, ఆమె ఆరోపణలు వాస్తమేనని తేలుతోంది. మరోవైపు తనుశ్రీపై లైంగిక వేధింపులు జరిగిన సమయంలో సెట్స్‌లో ఉన్న ప్రత్యక్ష సాక్షులు సైతం తనుశ్రీకే మద్దతు ఇస్తున్నారు. డ్యాన్సర్ నుంచి నటిగా మారిన డైసీ షా కూడా తనుశ్రీకే మద్దతు పలికారు. హార్న్ ఓకే ప్లీజ్’ సినిమా సెట్లో పాటను షూట్ చేస్తున్న సమయంలో తొలి రెండు రోజులు బాగానే ఉందని, కానీ మూడో రోజు మాత్రం ఏదో జరిగిందని తనకు అర్థమైందని తెలిపారు. ఆ సమయంలో తన జాబ్ తనుశ్రీకి, ఆమె టీమ్‌కు స్టెపులు నేర్పడమని, కానీ మూడో రోజు సెట్లలో ఏదో జరగడంతో, తనుశ్రీ అక్కడి నుంచి వెళ్లిపోయారని, ఆమె కారుపై కూడా దాడి జరిగినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment