
సాక్షి, హైదరాబాద్: సన్‌బర్న్ సంగీత కార్యక్రమానికి అనుమతుల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించారంటూ కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డికి మంత్రి కె.తారకరామారావు బావ మరిది, ఈటీజీ గ్లోబల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత రాజేంద్రప్రసాద్ పాకాల తన న్యాయవాదుల ద్వారా లీగల్ నోటీసులు పంపారు.
రాజకీయ లబ్ధికోసం, సంచలనాల కోసం రేవంత్‌రెడ్డి ఉద్దేశపూర్వకంగానే తమ క్లయింట్ రాజేంద్రప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ఆరోపణలు చేశారని న్యాయవాదులు తమ నోటీసులో పేర్కొన్నారు. అనుచిత వ్యాఖ్యలకుగాను మీడియా ముందుకు వచ్చి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. సన్‌బర్న్ కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment