
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌లకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు లీగల్ నోటీసులు జారీ చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ వ్యవహారంలో తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకుగానూ ఆయన వాళ్లిద్దరికీ నోటీసులు పంపించారు.
కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తనపై ఆరోపణలు చేస్తున్నారన్న కేటీఆర్.. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలుజేసే కుట్రలో భాగమే ఇదంతా అని పేర్కొన్నారు. ఉద్యోగాల జాతరకు పాతరేయాలన్న విపక్షాల కుట్రలు సాగనివ్వబోం. ఒక దురదృష్టకరమైన సంఘటనను బూచిగా చూపి.. మొత్తం నియామకాల ప్రక్రియ ఆపేయాలన్నదే బీజేపీ కాంగ్రెస్ కుట్ర. మతిలేని నేతల రాజకీయ ఉచ్చులో చిక్కుకోవద్దని తెలంగాణ యువతకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. పరీక్షలకు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు.
ఇదీ చదవండి: ప్రధానితో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ భేటీ
Comments
Please login to add a commentAdd a comment