
ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, ఎండీ రాధాకృష్ణ(ఫైల్ ఫొటో)
హైదరాబాద్: ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్లకు వైఎస్ఆర్సీపీ లీగల్ నోటీసులు ఇచ్చింది. 13.12.2014న విశాఖపట్నం ఎడిషన్లో ప్రచురించిన ఆర్టికల్పై క్షమాపణ చెప్పాలని నోటీస్లో ఆ పార్టీ డిమాండ్ చేసింది.
నోటీస్ అందిన వారం రోజుల లోపల క్షమాపణలు చెప్పాలని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఆంధ్రజ్యోతి ఆర్టికల్ ప్రచురించినట్లు ఆ నోటీస్లో పేర్కొన్నారు.