సాక్షి, గుంటూరు: తాను సంపద సృష్టి చేస్తే.. చంద్రబాబు ఆవిరి చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. మంచి చేసినోడిపై రాళ్లు వేస్తున్నారంటూ మండిపడ్డారు.
‘‘డిసెంబర్ 1న సెకీ, ప్రభుత్వం మధ్య ఒప్పందం జరిగింది. పవర్ సేల్ అగ్రిమెంట్ జరిగింది. ఒప్పందంలో సెకీ, ఏపీ ప్రభుత్వం, డిస్కమ్‌ల సంతకాలు చేశాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందంలో థర్డ్ పార్టీ ఎక్కడుంది?. ఇంటర్ స్టేట్ ట్రాన్స్‌మిషన్ ఛార్జెస్ మినహాయిస్తూ ఒప్పందంలో స్పష్టంగా ఉంది. గుజరాత్, రాజస్థాన్‌లో పవర్ జనరేషన్ కాస్ట్ గురించే మాట్లాడుతున్నారు. ట్రాన్స్ మిషన్ కాస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు?. ధర్మం లేదు.. న్యాయం లేదు.. మంచి చేసిన వాళ్లపై బండలు వేయడమే పని’’ అంటూ చందబాబు, ఎల్లో మీడియాపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, ఆయన సోషల్ మీడియా నాపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తమిళనాడు కంటే ఏపీకి తక్కువ రేటుకే విద్యుత్ వచ్చింది. తక్కువ రేటుకు విద్యుత్ తీసుకొస్తే సన్మానించాల్సింది పోయి.. మాటలంటున్నారు. సంపద సృష్టి నేను చేస్తే.. బాబు ఆవిరి చేస్తున్నారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి వక్రీకరణ చేసి రాస్తున్నాయి. చంద్రబాబు, ఎల్లో మీడియా వక్రీకరించి మాట్లాడటం ధర్మమేనా?. ఈ ప్రతిపాదన అక్టోబర్ 28న కేబినెట్ ముందుకు ఎజెండా ఐటమ్ కింద వచ్చింది. టీవీ రేట్లు తగ్గినట్లు కరెంటు రేట్లు తగ్గాలని ఈనాడు రాసింది. వక్రీకరణలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పడానికి ఇవే ఉదాహరణలు’’ అంటూ వైఎస్ జగన్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment