‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.
లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి! బాబు గారి పాపాల చిట్టా చదివేయండి..
- బాబూ మీ హయాంలో ఉన్నత విద్య గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
- మీర్చిన ఫీజు రీయింబర్స్‌మెంట్ చాలక ఫీజుల కోసం పేదలు అప్పులు చేయలేదా? ఇప్పుడు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పేదింటి బిడ్డలు హాయిగా చదువుకుంటున్నది నిజం కాదా?
- ఉన్నత విద్యలో మీ హయాంలో 37 వేలు ఉన్న ప్లేస్‌మెంట్లు.. ఈ ప్రభుత్వంలో 1.80 లక్షలకు పెరిగాయన్నది మీకు తెలుసా లేదా? ఇందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన విప్లవాత్మక సంస్కరణలు పై చర్చించగలరా?
- మీ రాజకీయాల కోసం వర్సిటీల స్థాయి దిగజార్చారా లేదా? ఇప్పుడు అదే వర్సిటీల్లో ఎడెక్స్ ద్వారా అంతర్జాతీయ, ప్రతిష్టాత్మక వర్సిటీల భాగస్వామ్యంతో వరల్డ్‌క్లాస్ విద్యను అందిస్తుండటంపై చర్చిస్తారా? జగనన్న విదేశీ విద్య కోసం ఒక విద్యార్థిపై ఈ ప్రభుత్వం ఏకంగా రూ.1.20 కోట్లు వరకు ఖర్చు చేస్తుండటంపై మాట్లాడగలరా?
- బాబు వస్తే జాబ్ అంటూ ఎన్నికల్లో ప్రచారం
- ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.2 వేలు నిరుద్యోగ భృతి అంటూ మేనిఫేస్టోలో ప్రకటన
- 2019 చివరి ఏడాది వరకు బడ్జెట్‌లో ఒక్క పైసా కూడా ఎందుకు కేటాయించలేదు బాబూ?
- చివరి బడ్జెట్‌లో అరకొర కేటాయింపులే తప్ప ఒక్క నిరుద్యోగి కూడా నిరుద్యో భృతి పైసా ఇచ్చావా బాబూ?
- యువతను నిలువునా వంచనపై చర్చకు సిద్ధమా బాబూ?
- ఏపీపీఎస్సీ నియామకాలపై చర్చకు సిద్ధమా బాబూ!
- నాలుగేళ్లలో 31 నోటిఫికేషన్లు.. దిగ్విజయంగా నియామకాలు
- ఒక్క కోర్టు కేసు లేకుండా 7 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ
- నీ పాలనలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని.. ఎన్ని కోర్టు కేసులు.. వాయిదాలు.. దీనిపైనా చర్చకు సిద్ధమా?
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-2)
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-3)
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-4)
చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-5)
Comments
Please login to add a commentAdd a comment