‘‘లేస్తే మనిషిని కానన్నా’’డట వెనకటికి ఎవరో. ఇప్పుడు బాబు, అండ్ ఆయన పచ్చమంద తీరు అలాగే ఉంది. పద్నాలుగేళ్లు అధికారం వెలగబెట్టినా... మూడుసార్లు సీఎం కుర్చీపై కూర్చున్నా చెప్పుకోదగ్గ పథకం, కార్యక్రమేదీ చేపట్టలేని బాబుగారు... ఎన్నికలు ముంచుకొస్తున్న ఈ తరుణంలో మరోసారి ‘నేను అధికారంలోకి వస్తే...’’ అంటూ మొదలుపెట్టారు.
లేస్తే మనిషిని కానన్నట్టుగానే. అందుకే... ఐదేళ్లుగా, ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా సుపరిపాలన అందిస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి తన వల్ల మంచి జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో ఓటేయమని ధీమాగా చెబుతున్నారు. జగన్ అది చేశారా? ఇది చేశారా? అని పచ్చమంద నోరు పారేసుకునే ముందు.. ఒక్కసారి ఈ ప్రశ్నలకు జవాబు ఉందేమో చూసుకోండి! బాబు గారి పాపాల చిట్టా చదివేయండి..
- రైతుల రుణాలన్నీ భేషరతుగా మాఫీ అంటూ ఎన్నికల్లో ప్రచారం
- వ్యవసాయ రుణాలన్నీ మాఫీ అంటూ ఎన్నికల ప్రణాళికలు పేరొ‍్కనలేదా బాబూ?
- మార్చి 11, 2014 నాటికి రైతుల వ్యవసాయ రుణాలు రూ.87,612 కోట్లు ఉన్న మాట వాస్తవం కాదా బాబూ?
- అధికారంలోకి వచ్చాక మాట మార్చి కేవలం పంట రుణాలే అదీ కూడా ఒక లక్ష వరకే అంటూ రైతులను మోసం చేయలేదా బాబూ?
- బంగారం తాకట్లు పెట్టుకుంటే మా బాబు వచ్చి విడిపిస్తారంటూ ప్రచారం చేయలేదా బాబూ?
- అధికారంలోకి వచ్చాక కోటయ్య కమిటీ పేరుతో సవాలక్ష ఆంక్షలు పెట్టలేదా బాబూ?
- కేవలం ఐదేళ్లలో 15 వేల కోట్ల లోపు రుణాలు మాఫీ చేసి చేతులు దులుపుకోలేదా బాబూ?
- రైతులను నిలుపునా ముంచేసి అప్పుల ఊబిలోకి నెట్టేయలేదా బాబూ?
- రైతులు బంగారం వేలం పాటలు బ్యాంకులు వేస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు బాబూ ? మీ హయాంలో అంతా ప‘రేషన్’కదా?
- ప్రభుత్వ చౌకదాకాణాల ద్వారా మీ అనుయాయులు సాగించి బియ్యం అక్రమ రవాణాపై చర్చిద్దామా? ముక్కిపోయిన, పురుగులు పట్టిన, రంగుమారి, మట్టితో కూడిన బియ్యాన్ని పంపిణీ చేసిన మీ చరిత్రపై కూడా చర్చ జరగాలి!
- రేషన్ దుకాణల దగ్గర గంటల కొద్దీ క్యూలైన్లలో వృద్ధుల పాట్లు, సర్వర్లు పనిచేయక డీలర్లు చేసే ఫీట్లుపై చర్చిద్దాం?
- ఇప్పుడు నాణ్యమైన (సార్టెక్స్) బియ్యం అది కూడా ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి దగ్గరకే అందిస్తున్నారు. ఈ ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా?
మీదంతా ధాన్యం పేరిట దోపిడీనే కదా?
- కల్లాల్లోకి వెళ్లి స్వయంగా ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేసే విధానాన్ని మీరు ఏమని ప్రశ్నిస్తారు?
- మీ హయాంలో ఒక్కో సీజన్‌లో కొన్న ధాన్యం పరిమాణంతో పోలిస్తే రైతుల సంఖ్య కనిష్టంగా ఉన్న సందర్భాలపై చర్చిస్తారా?
- రైతులు పేరుతో మీ దళారులే ధాన్యం ప్రభుత్వానికి విక్రయించి మద్దతు ధర మింగేసిన పరిస్తితులకు.. ఇప్పుడు నేరుగా రైతు ఖాతాలోకే సంపూర్ణ మద్దతు ధర అందుతున్న తీరుపై చర్చిస్తారా?
- మీ ఐదేళ్ల పాలనలో సేకరించిన ధాన్యం పరిమాణం, ఈ 58 నెలల పాలనలో సేకరించిన ధాన్యం పరిమాణం గణాంకాలపై చర్చిస్తారా?
ఇదికూడా చదవండి: బాబు.. వీటికి బదులేది? (పార్ట్-1)
Comments
Please login to add a commentAdd a comment