
సాక్షి, గుంటూరు: గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. మంత్రి విడదల రజిని కార్యాలయంపై టీడీపీ, జనసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆఫీసు అద్దాలు ధ్వంసం చేసి ఫ్లెక్సీలను చించేశారు.
వివరాల ప్రకారం.. న్యూ ఇయర్ సందర్భంగా విడదల రజిని కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తెలుగుదేశం, జనసేన నాయకులు ఓవరాక్షన్ చేశారు. మంత్రి విడుదల రజిని కార్యాలయంపై ఎల్లో బ్యాచ్ రాళ్లు విసిరారు. అనంతరం, మంత్రి కార్యాలయంలోకి టీడీపీ కార్యకర్తలు దూసుకెళ్లారు. ఆఫీసు అద్దాలను పగులగొట్టి బీభత్సం సృష్టించారు. ఆఫీసు ముందున్న ఫ్లెక్సీలను చించేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు టీడీపీ, జనసేన కార్యకర్తలను చెదరగొట్టారు. అయితే, మంత్రి రజిని ఈరోజు గుంటూరు వెస్ట్‌లో ఏర్పాటు చేసిన తన ఆఫీసును ప్రారంభించడానికి రెడీ అయ్యారు. ఈ క్రమంలో దాడి జరిగింది.