గుంటూరు రూరల్: గుంటూరు నగర శివారులోని ఒక బ్యాంకు బ్రాంచిలో భారీ మోసం బయటపడింది. కొందరు వ్యక్తులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రుణాలు పొందినట్టు వెల్లడైంది. ఇందులో బ్యాంకు అప్రైజర్ ప్రమేయం కూడా ఉందని అధికారులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం బయటపడకుండా కొందరు అధికారులు నిజమైన బంగారం తాకట్టు పెట్టిన వారికి వారు వడ్డీతో కలిపి చెల్లించాల్సిన మొత్తం కంటే ఎక్కువ కట్టాలని నోటీసులు పంపడం, ఆడిట్‌లో అసలు విషయాలు వెలుగుచూడటంతో మొత్తం గుట్టంతా రట్టయింది. మొత్తం 107 మంది నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు వెల్లడైంది.
నిజమైన బంగారంతో రుణాలు పొందిన ఖాతాదారులు బ్యాంకుకు వచ్చి ఎక్కువ మొత్తానికి ఎందుకు నోటీసులు ఇచ్చారని ప్రశి్నంచినందుకు వారిని కూడా ఇబ్బంది పెట్టినట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారంపై ఆడిట్ ధికారులు, బ్యాంక్ అధికారులు గుంటూరు నల్లపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నల్లపాడు సీఐ రాంబాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. గుంటూరు – అమరావతి రోడ్డు గోరంట్ల గ్రామంలోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచిలో ఆడిట్ నిర్వహిస్తుండగా వెండి వస్తువులకు బంగారు పూత పూసి బంగారు వస్తువులుగా చూపి పలువురు కోట్ల రూపాయలు రుణాలు పొందారని బ్యాంక్ ఇంటర్నల్ అధికారి అనిల్ డెకాబె, బ్యాంక్ రీజినల్ మేనేజర్ ధనరాజ్ ఫిర్యాదు చేశారు.
2021 జనవరి 29 నుంచి 2023 నవంబరు 16 వరకు ఆడిట్ నిర్వహించగా 107 ఖాతాలలో నకిలీ బంగారంతో రుణాలు పొందినట్లు గుర్తించారు. వీటిలో దాదాపు 100 ఖాతాలలో నకిలీ బంగారం పెట్టి రుణం పొందే సమయంలో రీ అప్రైజల్ కూడా నిర్వహించలేదని గుర్తించారు. ఈ విధంగా నకిలీ బంగారంతో రూ.2.71 కోట్లు బ్యాంకుకు టోకరా వేసినట్లు తేలిందన్నారు. లోన్ అప్లికేషన్స్, అప్రైజల్ తదితర పరిశీలనలు చేయకుండా రుణాలు ఇ చ్చి నట్లు గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. నిజమైన బంగారంతో రుణాలు పొందిన పలువురు ఖాతాదారులకు వారు తీసుకున్న రుణం కంటే రెండు రెట్లకు నోటీసులు రావడంతో వారంతా కూడా పోలీసులను ఆశ్రయిస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment