దారుణం : డిగ్రీ విద్యార్థులు తాగి.. ఘర్షణకు దిగి | Degree student died in Clash with another Student | Sakshi
Sakshi News home page

Published Tue, Oct 16 2018 11:44 AM | Last Updated on Tue, Oct 16 2018 1:25 PM

Degree student died in Clash with another Student - Sakshi

సాక్షి, జగిత్యాల : జగిత్యాల మండలం తాటిపల్లిలో దారుణం చోటుచేసుకుంది. తాగిన మత్తులో ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణకుదిగారు. ఈ ఘర్షణలో ఒక విద్యార్థి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. తాటిపల్లికి చెందిన సాధినేని నవీన్, బొలిశెట్టి శ్రవణ్ ఇద్దరూ.. డిగ్రీ చదువుతున్నారు. వీరు మద్యం సేవించిన అనంతరం ఇద్దరు గొడవపడ్డారు. ఈ ఘర్షణలో సాధినేని నవీన్‌ను బొలిశెట్టి శ్రవణ్‌ కత్తితో పొడిచి హత్య చేశాడు. ఘటన గురించి సమాచారం అందడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. విద్యార్థుల మధ్య ఘర్షణకు కారణాలు తెలియదని, ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement