కడుపు నిండా తిను.. బాగా చదువుకో!
రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: మధ్యాహ్న భోజనాన్ని డిగ్రీ విద్యార్థులకూ అందుబాటులోకి తెచ్చింది రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం. శనివారం జిల్లావ్యాప్తంగా కూకట్‌పల్లి, మల్కాజిగిరి, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, హయత్‌నగర్, తాండూరు, వికారాబాద్‌లోని డిగ్రీ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టింది. పేద విద్యార్థులే సర్కారు కాలేజీల్లో చదువుతున్నారని భావించిన కలెక్టర్ రఘునందన్‌రావు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకు ఒక పూట భోజనం పెట్టడం ద్వారా చదువుపై శ్రద్ధ పెరిగి, ఉత్తీర్ణతాశాతం పెరుగుతుందని అంచనా వేశారు. మధ్యాహ్నం వంట కోసం నిధులు కేటాయించారు. దీంతో జిల్లావ్యాప్తంగా 1200 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందనుంది.