తెలంగాణాలో చదివిన వారికీ రీయింబర్స్‌మెంట్ | fee reimbursement for ap students in telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణాలో చదివిన వారికీ రీయింబర్స్‌మెంట్

Published Thu, Sep 29 2016 10:18 AM | Last Updated on Wed, Sep 5 2018 9:18 PM

fee reimbursement for ap students in telangana

యూనివర్సిటీక్యాంపస్:   తెలంగాణాలో డిగ్రీ చదివిన విద్యార్థులకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. సంబంధిత విద్యార్థులు దరఖాస్తులు పంపాలని సాంఘిక సంక్షేమశాఖ ఎస్వీయూ అధికారులను ఆదేశించింది. సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణా ప్రాంతంలో డిగ్రీ చదివి ప్రస్తుతం ఎస్వీయూలో పీజీ చేస్తున్న విద్యార్థులను నాన్‌లోకల్‌గా పరిగణించి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిరాకరించింది. ఈ అంశంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 12న ‘విద్యార్థులకు విభజన కష్టాలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన సాంఘిక సంక్షేమ శాఖ దరఖాస్తులను పంపాలని  ఎస్వీయూ అధికారులను ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement