
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో అత్యుత్తమ ఆభరణాల బ్రాండ్లలో ఒకటైన జీఆర్టీ జ్యువెలర్స్.. ఎంతో కాలంగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఆర్థికంగా వెనుకబడిన డిగ్రీ విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోంది.
ఇందుకోసం అందిన వెయ్యి దరఖాస్తులను పరిశీలించి 71 మంది అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసింది. ఒకటో సెమిస్టర్‌కు అర్హులైన విద్యార్థులకు రూ.25 లక్షలు అందజేసింది. రెండో సెమిస్టర్‌కు కూడా ఉపకార వేతనాలను అందిస్తామని.. డిగ్రీ పూర్తయ్యే వరకు ఈ సాయం కొనసాగుతుందని సంస్థ ఎండీ జీఆర్ ‘ఆనంద్’అనంతపద్మనాభన్ స్పష్టం చేశారు.