మంత్రి కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి | Cricketer Hanuma Vihari Meets KTR In Pragathi Bhavan On Monday | Sakshi
Sakshi News home page

మంత్రి కేటీఆర్‌ను కలిసిన హనుమ విహారి

Published Mon, Jan 18 2021 5:58 PM | Last Updated on Mon, Jan 18 2021 8:15 PM

Cricketer Hanuma Vihari Meets KTR In Pragathi Bhavan On Monday - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీమిండియా ఆటగాడు‌ హనుమ విహారి  సోమవారం తెలంగాణ ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాదపూర్వకంగా  కలిశాడు. సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో అశ్విన్‌తో కలిసి హనుమ విహారి కడదాకా నిలిచి మ్యాచ్‌ను డ్రాగా ముగియడంలో కీలకపాత్ర పోషించాడు. ఆసీస్‌ బౌలర్లు వరుస బౌన్సర్లతో బెంబెలెత్తించిన.. ఈ ఇద్దరు మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బ్యాటింగ్‌ చేసి జట్టును ఓటమినుంచి గట్టెక్కించారు.

హనుమ విహారి ప్రదర్శనపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ ద్వారా ప్రత్యేకంగా అభినందించిన సంగతి తెలిసిందే. అయితే తొడకండరాల గాయం కారణంగా విహారి ఆఖరిదైన నాలుగో టెస్టుకు దూరంకావడంతో ఇటీవల స్వదేశానికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం విహారి కేటీఆర్‌ను కలిశాడు. ఈ సందర్భంగా ఆసీస్‌ గడ్డపై చిరస్మరణీయ ప్రదర్శన చేసిన విహారిని మంత్రి కేటీఆర్‌ శాలువాతో సన్మానించారు. ఆసీస్‌ పర్యటనకు సంబంధించిన విషయాలను విహారీ కేటీఆర్‌కు వివరించాడు. కేటీఆర్‌ను కలవడం, క్రికెట్ గురించి ఇద్దరి మధ్య ఆసక్తికర చర్చ జరగడం ఆనందంగా ఉందని విహారి పేర్కొన్నాడు. అనంతరం కేటీఆర్‌తో దిగిన ఫొటోలను విహారి ట్విటర్‌లో షేర్‌ చేశాడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement