సిడ్నీ: ఆసీస్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ముందు 407 పరుగులు భారీ లక్ష్యం ఉన్న సంగతి తెలిసిందే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్ల నష్టానికి 98 పరుగులు చేసింది. పుజారా 9, కెప్టెన్ రహానే 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత్ గెలవాలంటే ఇంకా 309 పరుగులు చేయాల్సి ఉంది.
ఈ సంగతి కాసేపు పక్కనబెడితే.. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన పని ఇప్పుడు నవ్వు తెప్పిస్తుంది. ఆసీస్ 259 పరుగుల ఆధిక్యంలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్టీవ్ స్మిత్ 51 పరుగులు, కామెరాన్ గ్రీన్ 10 పరుగులతో ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన స్మిత్ రెండో ఇన్నింగ్స్‌లోనూ శతకం సాధించే పనిలో ఉన్నాడు. అయితే టీమిండియా జడేజా గైర్హాజరీలో నలుగురు బౌలర్లతో మాత్రమై బౌలింగ్ చేయాల్సి వచ్చింది. జట్టుకు కీలక బౌలర్‌గా వికెట్ తీయాల్సిన ఒత్తిడి బుమ్రాపై మరింత ఎక్కువైంది. మరో సీనియర్ అశ్విన్ ఒకవైపు బౌలింగ్ చేస్తున్నా వికెట్లు మాత్రం పడడం లేదు.(చదవండి: టీమిండియాకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు)
దీంతో బుమ్రాకు చిర్రెత్తికొచ్చిందేమో తనలో ఎప్పుడు చూడని ఒక కోణాన్ని చూపించాడు. బంతి వేయడానికి బౌలింగ్ ఎండ్‌వైపు సాగుతున్న బుమ్రా నాన్‌స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న స్మిత్‌ను చూస్తూ బెయిల్స్‌ను బంతితో కిందకు విసురుకుంటూ వెళ్లిపోయాడు. స్మిత్ ఇంక ఎంతసేపు ఆడుతావు.. తొందరగా ఔట్ అవ్వు అన్నట్లుగా బుమ్రా సంకేతం ఇచ్చినట్లుగా అనిపిస్తుంది. అయితే బుమ్రా చర్యతో ఫీల్డ్ అంపైర్ పాల్ రిఫీల్ షాక్ తిన్నాడు. బుమ్రా బెయిల్స్ పడేయగానే.. అతను ఎందుకిలా చేశాడు అనే కోణంలో రిఫీల్ చూస్తూ ఒక నిమిషం పాటు అలాగే నిలుచుండిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోనూ ట్విటర్‌లో షేర్ చేయగా వైరల్‌గా మారింది. బుమ్రా చేసిన పనికి అంపైర్ ఇచ్చిన స్టిల్ నవ్వు తెప్పిస్తుందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. (చదవండి: 'నన్ను తిడతావేంటి... ఆ నిర్ణయం థర్డ్ అంపైర్‌ది')
Look at Paul Reiffel's reaction after Bumrah knocks the bails over 😂 #AUSvIND pic.twitter.com/294ChqKBB0
— 7Cricket (@7Cricket) January 10, 2021
Comments
Please login to add a commentAdd a comment