టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రాపై ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ప్రశంసలు కురిపించాడు. ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో ప్రపంచంలోనే అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని కొనియాడాడు. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కోవడం కష్టమని.. అయితే, అతడి పోటీ మాత్రం మజానిస్తుందని పేర్కొన్నాడు. కాగా బంగ్లాదేశ్‌తో తాజా టెస్టు సిరీస్ బుమ్రా అదరగొడుతున్న విషయం తెలిసిందే.
చెన్నై వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో 400 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అంతకు ముందు టీ20 ప్రపంచకప్-2024లో 15 వికెట్లు కూల్చిన ఈ రైటార్మ్ పేసర్.. టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ప్రతిష్టాత్మక బోర్డర్-గావస్కర్ ట్రోఫీ
ఇక బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల అనంతరం.. బుమ్రా సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ఆడే అవకాశం ఉంది. అనంతరం భారత జట్టుతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్నాడు. ఇరుజట్ల మధ్య ప్రతిష్టాత్మకమైన బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో బుమ్రా భాగం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ బ్యాటింగ్ స్టార్ స్టీవ్ స్మిత్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ బుమ్రా బౌలింగ్ నైపుణ్యాలను కొనియాడాడు.
ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్
‘‘అతడొక అద్భుతమైన బౌలర్. కొత్త బంతి అయినా.. కాస్త పాతబడినా.. మొత్తంగా అలవాటుపడిన బంతికి అయినా.. అతడిని ఎదుర్కోవడం కష్టం. బుమ్రాకు అద్భుతమైన నైపుణ్యాలు ఉన్నాయి. అతడు గొప్ప బౌలర్. మూడు ఫార్మాట్లలోనూ ప్రస్తుతం ప్రపంచంలోనే నంబర్ వన్ ఫాస్ట్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. బుమ్రాను ఎదుర్కోవడం అంటే సవాలుతో కూడుకున్న పని’’ అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.
బుమ్రా ఉంటే అంతే
కాగా 2018-19, 2020-21లో ఆసీస్‌పై భారత్ గెలవడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. 2018-19లో నాలుగు టెస్టుల్లో 21, 2020-21లో మూడు టెస్టుల్లో 11 వికెట్లు కూల్చాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది నవంబరులో ఆస్ట్రేలియాకు వెళ్లనున్న రోహిత్ సేన ఐదు టెస్టులు ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ -2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్ గెలవడం అత్యంత ముఖ్యం.
చదవండి: Ind vs Ban: ఈ మ్యాచ్‌లో క్రెడిట్ మొత్తం వాళ్లకే: పాక్ మాజీ క్రికెటర్
Comments
Please login to add a commentAdd a comment