Sourav Ganguly: టీమిండియా మాజీ సారథులు సౌరవ్ గంగూలీ, సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ జట్టు కోసం కలిసి ఆడటం చూశాం. మరి.. భారత క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకువెళ్లే క్రమంలో ఈ దిగ్గజ త్రయం ముగ్గురూ కలిసి ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే ఎంత బావుంటుందో కదా! టీమిండియా సగటు కలగనే ఆ రోజు తొందర్లోనే వస్తుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి బాస్ గంగూలీ హింట్ ఇచ్చాడు.
ఇప్పటికే ద్రవిడ్‌ను హెడ్‌కోచ్‌గా నియమించడంలో కీలక పాత్ర పోషించిన దాదా.. సచిన్‌ను కూడా బీసీసీఐలో భాగం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంకేతాలు ఇచ్చాడు. ఈ మేరకు... ‘‘సచిన్ నిజంగా చాలా భిన్నమైన వ్యక్తి. తనకు ఇలాంటి అంశాల్లో భాగం కావడంపై పెద్దగా ఆసక్తి ఉండదు. అయితే, భారత క్రికెట్‌లో సచిన్ జోక్యం అనేది నిజంగా చాలా పెద్ద వార్తే అవుతుంది కదా! ఈ విషయమై పెద్ద కసరత్తే చేయాల్సి ఉంటుంది. ప్రతిభను సరిగా వినియోగించుకుంటే అద్భుతాలు చూడవచ్చు కదా’’ అని గంగూలీ పేర్కొన్నాడు.
అయితే, ప్రస్తుతం కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, వాటిని అధిగమించి.. ఏదో ఒకరోజు సచిన్‌ను భారత క్రికెట్‌లో మరోసారి భాగం చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. జర్నలిస్టు బోరియా మజుందార్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇక భారత హెడ్‌కోచ్‌గా ఉండేందుకు తొలుత నిరాకరించిన ద్రవిడ్.. గంగూలీ జోక్యంతో ఆ పదవి స్వీకరించిన సంగతి తెలిసిందే. అదే విధంగా టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్‌ను నేషనల్ క్రికెట్ అకాడమీ హెడ్‌గా నియమించడంలోనూ తన వంతు పాత్ర పోషించాడు.
చదవండి: IPL 2022 Auction: అవి 12 వేల కోట్లు.. ఇవి 40 వేల కోట్లు.. మొత్తంగా 50: గంగూలీ
Comments
Please login to add a commentAdd a comment