అత్యంత పాపులర్‌ ఆటగాడిగా అరుదైన గౌరవం | Virat Kohli Top List Of Most Popular SportsPersons India January 2022 | Sakshi
Sakshi News home page

Virat Kohli: అత్యంత పాపులర్‌ ఆటగాడిగా అరుదైన గౌరవం

Published Tue, Feb 22 2022 11:06 AM | Last Updated on Tue, Feb 22 2022 1:47 PM

Virat Kohli Top List Of Most Popular SportsPersons India January 2022 - Sakshi

టీమిండియా మెషిన్‌గన్‌గా పేరుపొందిన విరాట్‌ కోహ్లి అరుదైన గౌరవం పొందాడు. ఇటీవలే అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా పక్కకు తప్పుకున్న కోహ్లి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని తాజాగా మరోసారి నిరూపితమైంది. 2022 జనవరి నెలకుగాను భారత్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడిగా కోహ్లి అగ్రస్థానంలో నిలిచాడు. ఓర్మాక్స్‌ మీడియా జనవరి నెలకు గానూ అత్యంత పాపులర్‌ ఆటగాడు ఎవరనే దానిపై సర్వే నిర్వహించింది.

చదవండి: Dhoni-Deepak Chahar: 'రిటైర్మెంట్‌ రోజు ధోని చెప్పిన మాట నిలబెట్టుకున్నా'

ఆ సర్వేలో కోహ్లి తొలి స్థానంలో ఉండగా.. మాజీ ఆటగాడు ఎంఎస్‌ ధోని రెండో స్థానం, ప్రస్తుత టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మూడో స్థానంలో ఉండడం విశేషం. వన్డేల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్న కోహ్లి.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో వన్డే విభాగంలో రెండు.. టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం.. టి20 ర్యాంకింగ్స్‌లో పదో స్థానంలో ఉన్నాడు. ఇప్పటితరం ఆటగాళ్లలో అత్యంత టాలెంటెడ్‌ ప్లేయర్‌గా పేరుపొందిన కోహ్లి అంతేస్థాయిలో ప్రజాభిమానాన్ని చూరగొనడం సర్వేలో వెల్లడైంది. అందుకే కోహ్లి అగ్రస్థానం సంపాదించినట్లు ఓర్మాక్స్‌ వెల్లడించింది.

ఇక మిగతా స్థానాల విషయానికి వస్తే.. నాలుగో స్థానంలో టీమిండియా దిగ్గజ క్రికెటర్‌.. మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ నిలిచాడు. క్రికెట్‌కు వీడ్కోలు పలికి దశాబ్దం కావొస్తున్న వేళ సచిన్‌ను ఇప్పటికి ఆరాధిస్తుండడం ప్రత్యేకత సంతరించుకుంది. క్రికెట్‌లో ఎవరు సాధించలేని.. ఇకపై ఎవరు అందుకోలేని ఘనతలు సాధించడమే కారణమని సర్వేలో తేలింది. ఐదు, ఆరు స్థానాల్లో ఫుట్‌బాల్‌ స్టార్‌ ప్లేయర్స్‌ క్రిస్టియానో రొనాల్డో, లియోనల్‌ మెస్సీలు నిలవడం విశేషం. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు(బ్యాడ్మింటన్‌) ఏడో స్థానంలో నిలవగా.. సైనా నెహ్వాల్‌ ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక తొమ్మిదో స్థానంలో టీమిండియా వైస్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ ఉండగా.. పదో స్థానంలో ఇటీవలే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పిన సానియా మీర్జా ఉండడం విశేషం.

చదవండి: Wriddiman Saha: బెదిరింపులు నిజమేనా?.. సాహాను వివరణ కోరనున్న బీసీసీఐ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement