#BlueTick Removal: మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్ టీమిండియా క్రికెటర్లకు షాకిచ్చింది. మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత సారథి రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తదితరుల అకౌంట్ నుంచి బ్లూ టిక్ తొలగించింది. ఈ మేరకు గురువారం ఈ క్రికెట్ స్టార్ల అకౌంట్ వెరిఫికేషన్ మార్క్ తొలగించింది.
మస్క్ రాగానే మార్పులకు శ్రీకారం
ప్రముఖ వ్యాపార దిగ్గజం, బిలియనీర్ ఎలన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత సంచలన మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అధికార ఖాతా ధ్రువీకరణకు సంకేతమైన బ్లూ టిక్‌ను ఉచితంగా అందించే సేవలకు స్వస్తి పలికారు. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీల వ్యక్తిగత అధికారిక ఖాతాలకు బ్లూ టిక్, ప్రభుత్వ రంగ సంస్థలు వాడే ట్విటర్ అకౌంట్‌కు గ్రే టిక్, వ్యాపార సంబంధిత సంస్థలకు గోల్డ్ కలర్ టిక్ అందించనున్నట్లు వెల్లడించారు.
అందుకే క్రికెటర్ల ఖాతా నుంచి బ్లూ టిక్ మాయం
ఈ క్రమంలో నెలవారీ చార్జీలు చెల్లించిన వారికి మాత్రమే 2023 ఏప్రిల్ 20 నుంచి బ్లూ టిక్ అందిస్తామన్న ప్రకటనను మస్క్ తాజాగా అమల్లోకి తెచ్చారు. కాగా ట్విటర్‌లో వ్యక్తిగత ఖాతాకు బ్లూ టిక్ పొందాలంటే నెలకు 8 డాలర్ల మేర చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం చెల్లించని సెలబ్రిటీల ఖాతాల నుంచి బుధవారం అర్ధరాత్రి నుంచి బ్లూ టిక్ మాయమైనట్లు తెలుస్తోంది.
ఇందులో వివిధ రంగాల ప్రముఖులతో పాటు క్రికెట్ సెలబ్రిటీలు కూడా ఉన్నారు. ట్విటర్‌లో యాక్టివ్‌గా ఉండే కోహ్లి, రోహిత్ సహా భారత దిగ్గజం సచిన్ టెండుల్కర్ తదితరుల అకౌంట్ నుంచి బ్లూ టిక్ మాయమైపోయింది. స్టార్ ఫుట్‌బాలర్ క్రిస్టియానో రొనాల్డో కూడా ఈ జాబితాలో ఉండటం విశేషం. కాగా గురువారం మస్క్ కొత్త విధానం అమల్లోకి తెచ్చిన తర్వాత దాదాపు 3 లక్షల మంది బ్లూ టిక్ కోల్పోయినట్లు సమాచారం.
బ్లూ టిక్ ఉంటేనే
కాగా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వారి పేరిట పుట్టుకొచ్చే ఫ్యాన్ పేజీలు కోకొల్లలు. వీటిలో సదరు సెలబ్రిటీ అధికారిక ఖాతాను సూచించేందుకు బ్లూ టిక్ ప్రామాణికంగా ఉండేది.
చార్జీలు చెల్లిస్తే మళ్లీ
ఇక ఇప్పుడు మస్క్ పెట్టిన చార్జీలు చెల్లిస్తే బ్లూ టిక్ సౌలభ్యం కోల్పోయిన వాళ్లు తిరిగి తమ ఖాతాలకు టిక్‌లు పునురద్ధరించుకునే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్‌తో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, ధోని బిజిబిజీగా ఉన్నారు.
ఐపీఎల్‌తో మన స్టార్లు బిజీ
ధోని సారథ్యంలోని సీఎస్‌కే ఐదింట మూడు విజయాలతో మూడో స్థానంలో ఉండగా.. రోహిత్ నేతృత్వంలోని ముంబై ఆరో స్థానంలో కొనసాగుతోంది. కోహ్లి ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరించిన గురువారం నాటి మ్యాచ్‌లో పంజాబ్‌పై గెలుపొంది పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది బెంగళూరు జట్టు.
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి, రోహిత్ తదితరులు ట్విటర్ అకౌంట్‌లో బ్లూ టిక్ కోల్పోయిన నేపథ్యంలో నెట్టింట వీరి పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు వీరిని ట్రోల్ చేస్తున్నారు. ఇక కోహ్లికి ట్విటర్‌లో 55.1 మిలియన్ ఫాలోవర్లు ఉండగా.. రోహిత్‌కు 21.7 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.
సచిన్ , కోహ్లి... ధోని, రోహిత్ శర్మ లే కాదు సైనా నెహ్వాల్, నీరజ్ చోప్రా, బజరంగ్ పూనియా, వినేశ్ ఫొగాట్, బాక్సర్ నిఖత్ జరీన్, సానియా మీర్జా, సునీల్ చెత్రి, పీఆర్ శ్రీజేశ్, అంతర్జాతీయ దిగ్గజాలు ఫెడరర్, రాఫెల్ నాదల్ (టెన్నిస్), క్రిస్టియానో రొనాల్డో, ఎంబాపె (ఫుట్‌బాల్), ఖాతాలకు కూడా ‘బ్లూ మార్క్’లు కనిపించవు.
ఏమిటీ ‘బ్లూ టిక్’?
సచిన్ లేదంటే ఇంకే హీరో పేరుమీద ఇతరులు కూడా నకిలీ ఖాతాలు తెరుస్తారు. కానీ అసలైన సచిన్ టెండూల్కర్ ట్విట్టర్ ఖాతా ఏదంటే మాత్రం ‘బ్లూ టిక్’తో వెరిఫైడ్ ఐడెంటిటీ తేలిపోతుంది.
ఇప్పుడీ అధికారిక ముద్ర కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. వెరిఫైడ్ ఐడెంటిటీ కావాలంటే వెబ్ పోర్టల్‌కు రూ. 650, మొబైల్ ఫోన్లకు రూ. 900 ప్రతి నెలా చెల్లించాలి. ‘బ్లూటిక్’ మార్క్ తొలగించడంతో సచిన్ తన అధికారిక ఖాతాలో జాతీయ పతాకాన్ని పెట్టుకొని ఇదే నా ‘బ్లూ టిక్ వెరిఫికేషన్’ అని కామెంట్ జత చేశాడు.
చదవండి: సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. చెన్నైకి గుడ్ న్యూస్! 16 కోట్ల ఆటగాడు రెడీ..
ఎట్టకేలకు దాదా ముఖంలో ఆ నవ్వు! 25 ఏళ్ల క్రితం అప్పుడలా.. మళ్లీ ఇప్పుడు..
Virat kohli without Blue tick😭 pic.twitter.com/QU96OEUITw
— Arun Singh (@ArunTuThikHoGya) April 20, 2023
Elon Musk after Removing Blue tick from Celeb’s Account:pic.twitter.com/fLMlYxsJDB
— Pulkit🇮🇳 (@pulkit5Dx) April 20, 2023
Blue tick hatane ke bad Elon Musk pic.twitter.com/8F7bMSAOH6
— Desi Bhayo (@desi_bhayo88) April 20, 2023
Comments
Please login to add a commentAdd a comment