ఐపీఎల్ 2023 జోరుగా సాగుతోంది. ప్రతీ మ్యాచ్ ఆఖరి వరకు సాగుతూ ఆద్యంతం ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఈ సీజన్‌లో చాలా మ్యాచ్‌ల్లో ఆఖరి వరకు ఎవరు గెలుస్తారు అని చెప్పడం కూడా కష్టంగా మారిపోయింది. ఇప్పటికే సగం మ్యాచ్‌లు ముగియడం.. రెండో దశ పోటీలు జరుగుతుండడంతో పోరు మరింత రసవత్తరంగా సాగుతోంది.
అయితే ఐపీఎల్ అన్ని సీజన్లు చూసుకుంటే.. కొంతమంది ఆటగాళ్లు మాత్రం.. ఐపీఎల్ ప్రారంభం నుంచి ఆడుతూనే ఉన్నారు. అంటే 2008 నుండి 2023 వరకు ప్రతి సీజన్‌లో ఏడుగురు ఆటగాళ్లు మాత్రమే కనిపించారు. ఆ ఆటగాళ్లు ఎవరు? ఏ జట్టు కోసం ఆడారు అనే వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
ఎంఎస్ ధోని
Photo: IPL Twitter
మొదటి ఐపీఎల్‌లో సీఎస్‌కే కెప్టెన్‌గా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన ధోని(Dhoni), ఆ తర్వాత రైజింగ్ పుణె సూపర్‌జెయింట్‌కు ఆడాడు. ఇప్పుడు సీఎస్‌కే జట్టులోనే కొనసాగుతున్నాడు. ఇప్పటికే చెన్నైని నాలుగుసార్లు ఛాంపియన్‌గా నిలిపాడు.
రోహిత్ శర్మ
Photo: IPL Twitter
2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడడం ద్వారా ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన రోహిత్ శర్మ(Rohit Sharma) ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరఫున ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా రోహిత్‌కు పేరుంది. ఐపీఎల్‌లో ఇప్పటివరకు ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఛాంపియన్స్‌గా నిలిచింది.
విరాట్ కోహ్లి
Photo: IPL Twitter
2008 నుంచి ఆర్‌సీబీ(RCB) తరఫున ఆడుతున్న విరాట్ కోహ్లి ఇప్పటికీ అదే బెంగళూరు ఫ్రాంచైజీ తరఫున కొనసాగుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక కాలం ఒకే జట్టు తరఫున ఆడిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. కొన్నేళ్ల పాటు ఆర్‌సీబీ కెప్టెన్‌గా జట్టును విజయవంతంగా నడిపించిన కోహ్లి ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు.
శిఖర్ ధావన్
Photo: IPL Twitter
2008లో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) తరపున ఆడిన శిఖర్ ధావన్, ఆ తర్వాత ముంబై ఇండియన్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టు కెప్టెన్‌గా ఐపీఎల్‌లో కొనసాగుతున్నాడు.
వృద్దిమాన్ సాహా
Photo: IPL Twitter
2008లో కేకేఆర్ తరపున ఆడటం ద్వారా తన ఐపీఎల్ కెరీర్‌ను ప్రారంభించిన వృద్ధిమాన్ సాహా ఇప్పుడు గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తరపున ఆడుతున్నాడు.
దినేశ్ కార్తిక్
Photo: IPL Twitter
దినేశ్ కార్తీక్(Dinesh Karthik) తన ఐపీఎల్ కెరీర్‌ను 2008లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రారంభించాడు. తర్వాత పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్,ఆర్‌సీబీ, గుజరాత్ లయన్స్, కేకేఆర్ తరపున ఆడాడు. ఇప్పుడు అతను తాజాగా మళ్లీ ఆర్‌సీబీ జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌గా కనిపిస్తున్నాడు.
మనీష్ పాండే
Photo: IPL Twitter
తొలి ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన మనీష్ పాండే(Manish Pandey), ఆ తర్వాత ఆర్‌సీబీ, పూణే వారియర్స్, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌గా ఆడుతున్నాడు. ఈ ఏడు మంది ఆటగాళ్లు 2008 నుండి 2023 వరకు ఐపీఎల్ ప్రతి సీజన్‌లో ఆడారు. ఈ జాబితాలో విదేశీ ఆటగాళ్లెవరూ లేకపోవడం విశేషం.
చదవండి: ఒక్క ఓవర్‌లో 46 పరుగులు.. క్రికెట్ చరిత్రలో తొలిసారి
Comments
Please login to add a commentAdd a comment