Road Safety World Series T20: Sachin Conversation With Irfan Pathan Son Video Goes Viral - Sakshi
Sakshi News home page

మీ నాన్న వల్లే గెలిచాం.. బుడ్డోడిని ముద్దు చేసిన సచిన్‌.. వీడియో వైరల్‌

Published Sat, Oct 1 2022 3:08 PM | Last Updated on Sat, Oct 1 2022 5:07 PM

Sachin Tendulkar Conversation With Irfan Pathan Son Video Viral - Sakshi

ఇర్ఫాన్‌ పఠాన్‌- ఇమ్రాన్‌తో సచిన్‌ టెండుల్కర్‌(PC: Irfan Pathan Instagram)

Road Safety World Series T20 2022 - India Legends vs Sri Lanka Legends In Final: రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌-2022 సెమీ ఫైనల్లో భాగంగా అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌. ఈ టీ20 లీగ్‌లో ఇండియా లెజెండ్స్‌ తరఫున బరిలోకి దిగిన ఇర్ఫాన్‌.. కీలక మ్యాచ్‌లో రాణించి జట్టును ఫైనల్‌లో చేర్చడంలో తన వంతు సాయం చేశాడు.

ఓపెనర్‌ నమన్‌ ఓజా 90 పరుగులతో అజేయంగా నిలవగా.. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇర్ఫాన్‌ పఠాన్‌ ఆఖర్లో మెరుపులు మెరిపించాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 308కి పైగా స్ట్రైక్‌రేటుతో 37 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. వీరిద్దరి అద్భుత ఇన్నింగ్స్‌ కారణంగా సచిన్‌ టెండుల్కర్‌ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్‌ మరో నాలుగు బంతులు ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.

మీ నాన్న వల్లే గెలిచాం!
5 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్‌పై గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ షేర్‌ చేసిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో సచిన్‌.. ఇర్ఫాన్‌ చిన్నారి కుమారుడు ఇమ్రాన్‌తో సరదాగా ముచ్చటిస్తూ.. ‘‘మేము ఈరోజు మ్యాచ్‌ ఎలా గెలిచామో తెలుసా? ఆయనెవరో తెలుసు కదా! ఆయన టప్‌ టప్‌మని సిక్స్‌లు కొట్టాడు. అలా మేము గెలిచాం’’ అంటూ బుడ్డోడిని ముద్దు చేశాడు.

ఈ వీడియో సచిన్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. లెజెండ్‌ .. చిన్న పిల్లలతో కూడా బాగా కలిసిపోతారు. ముద్దు చేయడంలో ముందుంటారు అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇమ్రాన్‌కు సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ బాగానే ఉంది. అతడికి 90వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఇక శనివారం రాయ్‌పూర్‌ వేదికగా శ్రీలంక లెజెండ్స్‌తో ఫైనల్లో తలపడేందుకు ఇండియా లెజెండ్స్‌ సిద్ధమవుతోంది. 

చదవండి: Ind Vs SA: అతడొక అద్భుతం.. టీమిండియాకు మరో జహీర్‌ ఖాన్‌ దొరికేశాడు: పాక్‌ మాజీ క్రికెటర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement