WI Vs BAN, Road Safety World Series 2022: West Indies Legends Beat Bangladesh Legends by 6-Wickets - Sakshi
Sakshi News home page

Road Safety World Series 2022: 98 పరుగులకే బంగ్లా లెజెండ్స్‌ ఆలౌట్‌.. విండీస్‌ లెజెండ్స్ ఘన విజయం

Published Sun, Sep 11 2022 7:14 PM | Last Updated on Mon, Sep 12 2022 8:30 AM

West Indies Legends Beat Bangladesh Legends By 6-Wkts RSWS 2022 - Sakshi

రోడ్‌సేఫ్టీ వరల్డ్‌ సిరీస్‌లో భాగంగా ఆదివారం వెస్టిండీస్‌ లెజెండ్స్‌, బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ మధ్య కాన్పూర్‌ వేదికగా మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో విండీస్‌ లెజెండ్స్‌ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ లెజెండ్స్‌ 19.4 ఓవర్లలో 98 పరుగులకే కుప్పకూలింది. విండీస్‌ బ్యాటర్లలో గోష్‌ 22 పరుగులతో టాప్‌ స్కోరర్‌ కాగా.. అలోక్‌ కపాలి 19, అహ్మద్‌ 13 పరుగులు చేశారు. విండీస్‌ బౌలర్లలో సంతోకి 3, బెన్‌, మహ్మద్‌ చెరో రెండు వికెట్లు తీయగా.. మారన్‌ బ్లాక్‌, బిషూ చెరొక వికెట్‌ తీశారు.

అనంతరం 99 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ లెజెండ్స్‌ 15.2 ఓ‍వర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్‌ డ్వేన్‌ స్మిత్‌ 42 బంతుల్లో 51 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో కిర్క్‌ ఎడ్‌వర్డ్స్‌ 22, విలియమ్‌ పెర్కిన్స్‌ 9 పరుగులు చేసి జట్టును గెలిపించారు. బంగ్లా బౌలర్లలో అబ్దుర్‌ రజాక్‌, డోలార్‌ మహ్ముద్‌, అలోక్‌ కపాలి తలా ఒక వికెట్‌ తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement