ఫుల్‌ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన | 15 member squad for Test series announced | Sakshi
Sakshi News home page

ఫుల్‌ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన

Published Mon, Sep 12 2016 12:38 PM | Last Updated on Tue, Aug 28 2018 7:08 PM

ఫుల్‌ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన - Sakshi

ఫుల్‌ స్ట్రెంథ్‌తో బరిలోకి కోహ్లి సేన

న్యూఢిల్లీ: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌కు బీసీసీఐ సోమవారం 15మంది సభ్యులతో జట్టును ప్రకటించింది. ఇటీవల వెస్టిండీస్‌ పర్యటనకు వెళ్లిన 17 మంది ఆటగాళ్లలో 15మందిని జట్టులో కొనసాగించింది. ఆల్‌రౌండర్‌ స్టువర్ట్‌ బిన్నీ, బౌలర్‌ షార్దుల్‌ ఠాకూర్‌పై వేటు వేసింది.  

విరాట్‌ కోహ్లి నాయకత్వంలో పూర్తి బలగంతో స్వదేశంలో న్యూజిల్యాండ్‌తో అమీతుమీ తేల్చుకోవడానికి టీమిండియా సిద్ధమవుతోంది. ఈ నెల 22న కాన్పూర్‌లో జరిగే మొదటి మ్యాచ్‌తో ఈ మూడు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది.

బీసీసీఐ ప్రకటించిన భారత క్రికెట్‌ జట్టు ఇదే
 విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, చటేశ్వర్‌ పుజరా, అంజిక్యా రహానే, శిఖర్‌ ధావన్‌, ఎం విజయ్‌, రోహిత్ శర్మ‌, ఆర్‌ అశ్విన్‌, వృద్ధిమాన్‌ సాహా, రవీంద్ర జడేజా, మహమ్మద్‌ షమీ, ఇశాంత్ శర్మ‌, భువనేశ్వర్‌, అమిత్‌ మిశ్రా, ఉమేశ్‌ యాదవ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement