'మ్యాచ్ ను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది' | Happy to have saved the match for India, says delighted Binny | Sakshi
Sakshi News home page

'మ్యాచ్ ను రక్షించినందుకు చాలా సంతోషంగా ఉంది'

Published Mon, Jul 14 2014 6:02 PM | Last Updated on Sat, Sep 2 2017 10:17 AM

Happy to have saved the match for India, says delighted Binny

నాటింగ్ హమ్:భారత్ -ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలిటెస్టు మ్యాచ్ ప్రతర్థి చేతుల్లోకి వెళ్లకుండా కాపాడినందుకు చాలా ఆనందంగా ఉందని భారత్ ఆటగాడు స్టువర్డ్ బిన్నీ తెలిపాడు. ఆ టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్ లో బిన్నీ(78) పరుగులతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన బిన్నీ.. తొలి ఇన్నింగ్స్ లో విఫలమైనా.. రెండో ఇన్నింగ్స్ లో చేసిన పరుగులు  జట్టుకు ఉపయోగపడినందుకు సంతోషంగా ఉందన్నాడు.' నేను ఫస్ట్ ఇన్నింగ్స్ లో చాలా నిరాశ చెందాను. క్రీజ్ లో పది-పది హేను నిమిషాలు కష్టపడ్డా.. ఒక చెత్త షాట్ కొంపముంచిందని' బిన్నీ తెలిపాడు.

 

సెకెండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి ఎక్కువ సమయం క్రీజ్ లో ఉండాలనుకున్నానని, ఆ సానుకూల థృక్పధంతోనే క్రీజ్ లో కి అడుగుపెట్టానని తెలిపాడు. అందరికీ జట్టు క్లిష్ట పరిస్థితుల్నినుంచి కాపాడే అవకాశం రాదని.. కానీ అటువంటి అవకాశం తనకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement