ఆ విలువైన విషయాన్ని నేర్చుకున్నాం:కోహ్లి | Learnt valuable lesson in how to draw a Test, says Kohli | Sakshi
Sakshi News home page

ఆ విలువైన విషయాన్ని నేర్చుకున్నాం:కోహ్లి

Published Mon, Nov 14 2016 11:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:05 PM

ఆ విలువైన విషయాన్ని నేర్చుకున్నాం:కోహ్లి

రాజ్కోట్:ఇప్పటివరకూ విరాట్ కోహ్లి నేతృత్వంలో టీమిండియా 18 టెస్టులు ఆడగా, వాటిలో రెండింట మాత్రమే పరాజయం పాలైంది. అయితే ఇంగ్లండ్ తో సుదీర్ఘ సిరీస్లో భాగంగా రాజ్కోట్లో జరిగిన తొలి టెస్టు ద్వారా ఒక అమూల్యమైన విషయాన్ని  నేర్చుకున్నామని అంటున్నాడు కోహ్లి. 'ఇంగ్లండ్తో తొలి టెస్టు ఆద్యంత చూస్తే ఎక్కువ శాతం భారత్ వెనుకబడిన మాట వాస్తవమే. అయితే ఇటీవల గెలుపును మాత్రమే అలవాటు చేసుకున్న భారత్కు, ఓటమి నుంచి కూడా ఎలా బయటపడాలో ఇంగ్లండ్ తో తొలి టెస్టు నేర్పింది. ఆ విలువైన విషయాన్ని ఇక్కడే నేర్చుకున్నాం. ఇందు కోసం కృషి చేయడంలో జట్టు సమిష్టిగా రాణించింది. అది నన్ను చాలా ఆకట్టుకుంది' అని కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు.

మ్యాచ్ చివరి రోజు ఆటలో బంతి అనుకున్నదాని కంటే ఎక్కువ టర్న్ అవడమే కాకుండా, బాగా బౌన్స్ కూడా అయినట్లు కోహ్లి స్పష్టం చేశాడు. ఆ నేపథ్యంలోనే భారత్ తన రెండో ఇన్నింగ్స్ ఆదిలో కీలక వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో పడిందన్నాడు. అయితే ఈ తరహాలో గేమ్ను రక్షించుకోవడం భారత్ జట్టుకు చాలా అరుదుగా మాత్రమే సంభవిస్తుందన్నాడు. కచ్చితంగా తొలి టెస్టు నుంచి ఎన్నో విషయాలను నేర్చుకున్నామని, ప్రధానంగా గేమ్ ను ఎలా కాపాడుకోవాలో బాగా అవగతమైనట్లు కోహ్లి అన్నాడు.ఒకవేళ తదుపరి సిరీస్లో మరొకసారి ఇదే పరిస్థితి ఎదురైనా దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కోహ్లి పేర్కొన్నాడు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement