
బర్మింగ్‌హామ్: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో భాగంగా ఇంగ్లండ్ తన మొదటి ఇన‍్నింగ్స్‌లో 287 పరుగుల వద్ద ఆలౌటైంది. 285/9 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం రెండో రోజు ఆటను ఆరంభించిన ఇంగ్లండ్ మరో రెండు పరుగులు మాత్రమే జత చేసి చివరి వికెట్‌ను కోల్పోయింది.
ఓవర్‌నైట్ ఆటగాడు స్యామ్ కరన్(24) చివరి వికెట్‌గా పెవిలియన్ చేరడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఇంగ్లండ్ ఆఖరి వికెట్‌ను మహ్మద్ షమీ సాధించాడు. భారత బౌలర్లలో అశ్విన్ నాలుగు వికెట్లు సాధించగా, షమీ మూడు వికెట్లతో మెరిశాడు. ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలకు తలోవికెట్ దక్కింది.