స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. ఆయన కొడుకులు సైతం! | Fathers Day 2023: Lala Amarnath And His Sons Father Son Duos in Cricket World | Sakshi
Sakshi News home page

Fathers Day 2023: స్వాతంత్య్రం వచ్చాక టీమిండియా తొలి కెప్టెన్‌గా.. కొడుకులు సైతం!

Published Sun, Jun 18 2023 12:11 PM | Last Updated on Sun, Jun 18 2023 12:34 PM

Fathers Day 2023: Lala Amarnath And His Sons Father Son Duos in Cricket World - Sakshi

భారత క్రికెట్‌ తొలితరం క్రీడాకారుల్లో లాలా అమర్‌నాథ్‌ భరద్వాజ్‌ అగ్రగణ్యుడు. టెస్ట్‌ క్రికెట్‌లో సెంచరీ సాధించిన తొలి భారతీయుడిగా 1933లోనే ఆయన చరిత్ర సృష్టించారు. రెండో ప్రపంచయుద్ధ కాలంలో భారత్‌ అధికారికంగా ఎలాంటి అంతర్జాతీయ టెస్ట్‌ మ్యాచ్‌లలోనూ పాల్గొనలేదు.

అదేకాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు సహా వివిధ జట్లతో జరిగిన ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లలో ఆడిన లాలా అమర్‌నాథ్‌ ఆ మూడేళ్ల వ్యవధిలోనే ముప్పయి సెంచరీలు సహా పదివేల పరుగుల మైలురాయిని అధిగమించారు.

స్వాతంత్య్రం వచ్చాక భారత క్రికెట్‌ జట్టుకు తొలి కెప్టెన్‌గా సారథ్యం వహించారు. బ్యాట్స్‌మన్‌గానే కాకుండా బౌలర్‌గానూ అద్భుతంగా రాణించారు. అప్పటి ఆస్ట్రేలియన్‌ స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డాన్‌ బ్రాడ్‌మాన్‌ను తన బౌలింగ్‌లో హిట్‌ వికెట్‌గా ఔట్‌చేసిన ఏకైక బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. క్రీడారంగంలో వారసులు నిలదొక్కుకోవడం చాలా కష్టం.

అలాంటిది లాలా అమర్‌నాథ్‌ కొడుకులు– సురీందర్‌ అమర్‌నాథ్, మోహీందర్‌ అమర్‌నాథ్‌ తండ్రి అడుగుజాడల్లోనే క్రికెట్‌ క్రీడాకారులుగా అంతర్జాతీయంగా రాణించారు. మొహీందర్‌ అమర్‌నాథ్‌ 1983 ప్రపంచకప్‌ సాధించిన జట్టు వైస్‌కెప్టెన్‌గా కీలక పాత్ర పోషించాడు.

లాలా అమర్‌నాథ్‌ చిన్న కొడుకు రాజీందర్‌ అమర్‌నాథ్‌ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడకపోయినా, ఫస్ట్‌క్లాస్‌ క్రికెటర్‌గా రాణించాడు.  రాజీందర్‌ తన తండ్రి జీవిత చరిత్రను ‘లాలా అమర్‌నాథ్‌: లైఫ్‌ అండ్‌ టైమ్స్‌– ది మేకింగ్‌ ఆఫ్‌ ఎ లెజెండ్‌’ పేరుతో రాశాడు. తండ్రి స్ఫూర్తితోనే తమ సోదరులు ముగ్గురమూ క్రికెట్‌లోకి అడుగు పెట్టామని రాజీందర్‌ చెబుతాడు.  

భారత క్రికెట్‌లో తండ్రీకొడుకులు
►వినోద్‌ మన్కడ్‌- అశోక్‌ మన్కడ్‌
►నయన్‌ మోంగియా- మోహిత్‌ మోంగియా
►యోగ్‌రాజ్‌ సింగ్‌- యువరాజ్‌ సింగ్‌

►రోజర్‌ బిన్నీ- స్టువర్ట్‌ బిన్నీ
►సునిల్‌ గావస్కర్‌- రోహన్‌ గావస్కర్‌
►హేమంత్‌ కనిత్కర్‌- హ్రిషికేశ్‌ కనిత్కర్‌

►విజయ్‌ మంజ్రేకర్‌- సంజయ్‌ మంజ్రేకర్‌
►పంకజ్‌ రాయ్‌- ప్రణబ్‌ రాయ్‌

చదవండి: ఖ్వాజా వీరోచిత సెంచరీ.. బ్యాట్‌ కిందకు విసిరి! వీడియో వైరల్‌
ఇండియాలో మ్యాచ్‌లంటే అంతే! వాళ్లు మాపై ఒత్తిడి పెంచి: నితిన్‌ మీనన్‌ సంచలన వ్యాఖ్యలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement