BCCI 91st Annual General Meeting Key Decisions Approved Women's IPL - Sakshi
Sakshi News home page

BCCI- Key Decisions: గంగూలీకి గుడ్‌బై! జై షా కొనసాగింపు.. బీసీసీఐ కీలక నిర్ణయాలివే!

Published Tue, Oct 18 2022 2:28 PM | Last Updated on Tue, Oct 18 2022 2:57 PM

BCCI 91st Annual General Meeting Key Decisions Approves Womens IPL - Sakshi

PC: BCCI

91st Annual General Meeting of BCCI: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి 91వ సర్వసభ్య సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు కొత్త అధ్యక్షుడిగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ రోజర్‌ బిన్నీ నియామకాన్ని ఖరారు చేసిన బీసీసీఐ నూతన ఆఫీస్‌ బేరర్ల పేర్లను కూడా వెల్లడించింది.

అదే విధంగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు సంబంధించి పలు కీలక అంశాల గురించి వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం నాటి ముంబై మీటింగ్‌కు సంబంధించిన పత్రికా ప్రకటన విడుదల చేసింది.

బీసీసీఐ సర్వసభ్య సమావేశం- ముఖ్యాంశాలు
బీసీసీఐ అధ్యక్షుడు- రోజర్‌ బిన్నీ
►ఉపాధ్యక్షుడు- రాజీవ్‌ శుక్లా
►కార్యదర్శి- జై షా
►సంయుక్త కార్యదర్శి- దేవజిత్‌ సైకియా
►కోశాధికారి(ట్రెజరర్‌)- ఆశిష్‌ షేలార్‌

►బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌లో జనరల్‌ బాడీ ప్రతినిధిగా ఎంకేజే మజూందార్‌
►ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ ప్రతినిధులుగా అరుణ్‌ ధుమాల్‌ సింగ్‌, అవిషేక్‌ దాల్మియా
►2022-23 ఏడాదికి సంబంధించి వార్షిక బడ్జెట్‌కు ఆమోదం
►2023-2027 మధ్య కాలంలో భారత పురుషుల జట్టు ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌, 2022-2025 మహిళల జట్టు ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రామ్‌ ధ్రువీకరణ
►మహిళల ఐపీఎల్‌ నిర్వహణకు మార్గం సుగమం చేసిన జనరల్‌ బాడీ

చదవండి: T20 WC NED Vs NAM: ఉత్కంఠ పోరులో నెదర్లాండ్స్‌ విజయం.. సూపర్‌-12కు అర్హత!
అతడు ప్రపంచ అత్యుత్తమ టీ20 ఆటగాళ్లలో ఒకడు: సచిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement