
బీసీసీఐ కార్యదర్శి జై షాతో గంగూలీ (ఫైల్ ఫొటో: PC: Sourav Ganguly)
Sourav Ganguly- Roger Binny: భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీ శకం ముగిసినట్లయింది. రెండో దఫా బీసీసీఐ బాస్ కావాలని దాదా ఆశించినా.. అందుకు బోర్డు నుంచి సానుకూల స్పందన రాలేదన్న వార్తల నేపథ్యంలో.. రోజర్ బిన్నీ నియామకం మంగళవారం ఖరారైంది. గంగూలీకి వీడ్కోలు చెప్పిన బోర్డు.. ప్రస్తుత కార్యదర్శి జై షాను మరోసాని ఆ పదవిని చేపట్టినట్లు వెల్లడించింది.
ఇందుకు సంబంధించి.. ముంబైలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ 36వ అధ్యక్షుడిగా బిన్నీ ఎన్నికైనట్లు బోర్డు అధికారికంగా ప్రకటించింది. కొత్త ఆఫీస్ బేరర్లు, మహిళా ఐపీఎల్ నిర్వహణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు వెల్లడించింది.
గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన గంగూలీ.. బీసీసీఐ ఇప్పుడు గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు ఏఎన్‌ఐతో మాట్లాడుతూ.. ‘‘రోజర్ బన్నీకి ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. కొత్త యాజమాన్యం బోర్డు ప్రతిష్టను మరింత పెంచుతుందని భావిస్తున్నా.
బీసీసీఐ గొప్ప వ్యక్తుల చేతుల్లో ఉంది. భారత క్రికెట్ గొప్ప స్థాయిలో ఉంది. ఆయనకు గుడ్ లక్ చెబుతున్నా’’ అని దాదా పేర్కొన్నాడు. కాగా గంగూలీ బీసీసీఐ బాస్‌గా ఉన్న సమయంలోనే టీమిండియా వన్డే కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లిపై వేటు పడ్డ విషయం తెలిసిందే. మరోవైపు.. హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ నియామకంలోనూ దాదా కీలకంగా వ్యవహరించాడు.
చదవండి: T20 World Cup Records: టీ20 వరల్డ్‌కప్‌లో అత్యుత్తమ రికార్డులివే
అయ్యో నిసాంక! పాపం కిందపడిపోయాడు.. షూ కూడా! హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే!