బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులకు ఆలౌట్
భారత్‌కు 227 పరుగుల భారీ ఆధిక్యం
బుమ్రాకు 4 వికెట్లు
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 81/3
భారత గడ్డపై టెస్టు మ్యాచ్ అంటే ప్రతీ విదేశీ జట్టుకూ సవాలే... బంగ్లాదేశ్‌కు కూడా అది తొలి టెస్టు తొలి రోజే చాలా వరకు అర్థమైంది. రెండో రోజుకు వచ్చేసరికి బంగ్లా పూర్తిగా చేతులెత్తేసింది.
తొలి రోజు ఆట ఆరంభంలో పదునైన బౌలింగ్‌తో భారత్‌ను ఇబ్బంది పెట్టిన బంగ్లా ఆ తర్వాత టీమిండియా జోరుకు తలవంచింది. శుక్రవారం కూడా భారత్ చివరి నాలుగు వికెట్లను త్వరగా తీసిన ఆనందం ముగియక ముందే మన పేసర్ల దెబ్బకు జట్టు కుప్పకూలింది. బంగ్లా పతనంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు.
ఫాలో ఆన్ ఆడించకుండా మళ్లీ బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ బృందం ఆధిక్యం ఇప్పటికే 300 దాటింది... మ్యాచ్ తీరు చూస్తే మూడో రోజే ముగిసినా ఆశ్చర్యం లేదు...రెండో రోజు ఆటలో ఇరు జట్లు కలిపి మొత్తం 17 వికెట్లు కోల్పోవడం చెప్పుకోదగ్గ అంశం.
చెన్నై: బంగ్లాదేశ్‌తో తొలి టెస్టుపై భారత్ రెండో రోజే పట్టు బిగించింది. భారత బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 149 పరుగులకే ఆలౌటైంది. షకీబ్ అల్ హసన్ (64 బంతుల్లో 32; 5 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో ప్రధాన పాత్ర పోషించగా...జడేజా, ఆకాశ్‌దీప్, సిరాజ్ తలా 2 వికెట్లతో అండగా నిలిచారు. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఏకంగా 227 పరుగుల ఆధిక్యం దక్కింది.
అయితే ఫాలో ఆన్ ఇవ్వడంకంటే మళ్లీ బ్యాటింగ్ చేసేందుకే రోహిత్ మొగ్గు చూపించాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 23 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు సాధించింది. శుబ్‌మన్ గిల్ (64 బంతుల్లో 33 నాటౌట్; 4 ఫోర్లు), రిషభ్ పంత్ (12 నాటౌట్) ప్రస్తుతం క్రీజ్‌లో ఉన్నారు.
అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 339/6తో ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 376 పరుగులకు ఆలౌటైంది. రెండో రోజు 11.2 ఓవర్లు మాత్రమే ఆడగలిగిన జట్టు మరో 37 పరుగులు జోడించగలిగింది. చేతిలో మరో 7 వికెట్లు ఉన్న టీమిండియా ప్రస్తుతం తమ ఓవరాల్ ఆధిక్యాన్ని 308 పరుగులకు పెంచుకుంది.
బౌలర్ల జోరు...
బుమ్రా వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతిని ఆడలేక వదిలేసిన షాద్‌మన్ ఇస్లామ్ (2) క్లీన్»ౌల్డయ్యాడు. అలా మొదలైన బంగ్లా పతనం వేగంగా సాగింది. ఆకాశ్ దీప్ తన రెండో ఓవర్లో తొలి రెండు బంతుల్లో రెండు వికెట్లతో బంగ్లా పని పట్టాడు. ఆకాశ్ బంతికి జాకీర్ హసన్ (3) స్టంప్ ముక్కలవగా...తర్వాతి బంతికే మోమినుల్ హక్ (0) ప్యాడ్లకు తాకుతా వెళ్లిన బంతి వికెట్లను పడగొట్టింది.
బౌల్డ్ కాకపోయినా మోమిన్ ఎల్బీగానైనా వెనుదిరిగేవాడే! రెండో సెషన్‌లో కూడా భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో బంగ్లా బ్యాటర్లు విఫలమయ్యారు. ఈ సెషన్‌లో బంగ్లా ఐదు వికెట్లు కోల్పోయింది. నజు్మల్ (20)ను సిరాజ్...ముషి్ఫకర్ రహీమ్ (8)ను బుమ్రా అవుట్ చేయడంతో స్కోరు 40/5 వద్ద నిలిచింది. ఈ దశలో షకీబ్, లిటన్ దాస్ (22) కొద్ది సేపు ప్రతిఘటించారు.
కొన్ని చక్కటి షాట్లు ఆడిన వీరిద్దరు ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అయితే జడేజా వరుస ఓవర్లలో స్వయంకృతంతో వీరిద్దరు పరుగు తేడాతో వెనుదిరగడం బంగ్లా ఆశలు కోల్పోయేలా చేసింది. అనవసరపు భారీ షాట్‌కు ప్రయత్నించి దాస్ అవుట్ కాగా, రివర్స్ స్వీప్‌కు ప్రయత్నించి షకీబ్ వికెట్ ఇచ్చేశాడు. ఆ తర్వాత హసన్ (9) వికెట్ బుమ్రా ఖాతాలో చేరింది. టీ విరామం తర్వాత మిగిలిన రెండు వికెట్లు తీసేందుకు భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు.
కోహ్లి దురదృష్టవశాత్తూ...
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే యశస్వి (10) పది పరుగులు రాబట్టగా...రోహిత్ శర్మ (5) తొలి బంతికే ఫోర్‌తో మొదలు పెట్టాడు. అయితే వీరిద్దరు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. మరో వైపు గిల్ కొన్ని చక్కటి షాట్లు ఆడి క్రీజ్‌లో పాతుకుపోయాడు. రెండో రోజు ఆట ముగియడానికి కొద్ది సేపు ముందు మిరాజ్ బౌలింగ్‌లో ఫ్లిక్ చేయబోయి విరాట్ కోహ్లి (17) వికెట్ల ముందు దొరికిపోయాడు.
గిల్‌తో మాట్లాడిన అనంతరం కోహ్లి రివ్యూ చేయకుండానే వెళ్లిపోయాడు. తర్వాత రీప్లేలో బంతి ప్యాడ్‌కు తగలక ముందే బ్యాట్‌కు తాకినట్లు తేలింది. రివ్యూ చేసి ఉంటే కోహ్లి నాటౌట్ అయ్యేవాడు. ఆ తర్వాత మరో 3.4 ఓవర్ల పాటు గిల్, పంత్ వికెట్ పడకుండా ఆటను ముగించారు.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి (సి) షాద్‌మన్ (బి) నాహిద్ 56; రోహిత్ (సి) నజ్ముల్ (బి) హసన్ 6; గిల్ (సి) దాస్ (బి) హసన్ 0; కోహ్లి (సి) దాస్ (బి) హసన్ 6; పంత్ (సి) దాస్ (బి) హసన్ 39; రాహుల్ (సి) జాకీర్ (బి) మిరాజ్ 16; జడేజా (సి) దాస్ (బి) తస్కీన్ 86; అశి్వన్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 113; ఆకాశ్ (సి) నజు్మల్ (బి) తస్కీన్ 17; బుమ్రా (సి) జాకీర్ (బి) హసన్ 7; సిరాజ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 30; మొత్తం (91.2 ఓవర్లలో ఆలౌట్) 376. వికెట్ల పతనం: 1–14, 2–28, 3–34, 4–96, 5–144, 6–144, 7–343, 8–367, 9–374, 10–376. బౌలింగ్: తస్కీన్ 21–4–55–3, హసన్ మహమూద్ 22.2–4– 83–5, నాహిద్ రాణా 18–2– 82–1, మెహదీ హసన్ మిరాజ్ 21–2–77–1, షకీబ్ 8–0–50–0, మోమినుల్ 1–0–4–0.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: షాద్‌మన్ (బి) బుమ్రా 2; జాకీర్ (బి) ఆకాశ్ 3; నజు్మల్ (సి) కోహ్లి (బి) సిరాజ్ 20; మోమినుల్ (బి) ఆకాశ్ 0; ముషి్ఫకర్ (సి) రాహుల్ (బి) బుమ్రా 8; షకీబ్ (సి) పంత్ (బి) జడేజా 32; లిటన్ దాస్ (సి) (సబ్) జురేల్ (బి) జడేజా 22; మిరాజ్ (నాటౌట్) 27; హసన్ (సి) కోహ్లి (బి) బుమ్రా 9; తస్కీన్ (బి) బుమ్రా 11; నాహిద్ (బి) సిరాజ్ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (47.1 ఓవర్లలో ఆలౌట్) 149. వికెట్ల పతనం: 1–2, 2–22, 3–22, 4–36, 5–40, 6–91, 7–92, 8–112, 9–130, 10–149. బౌలింగ్: బుమ్రా 11–1–50–4, సిరాజ్ 10.1–1–30–2, ఆకాశ్ దీప్ 5–0–19–2, అశ్విన్ 13–4–29–0, జడేజా 8–2–19–2.
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి (సి) దాస్ (బి) నాహిద్ 10; రోహిత్ (సి) జాకీర్ (బి) తస్కీన్ 5; గిల్ (బ్యాటింగ్) 33; కోహ్లి (ఎల్బీ) (బి) మిరాజ్ 17; పంత్ (బ్యాటింగ్) 12; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (23 ఓవర్లలో 3 వికెట్లకు) 81. వికెట్ల పతనం: 1–15, 2–28, 3–67. బౌలింగ్:
తస్కీన్ 3–0–17–1, హసన్ మహమూద్ 5–1–12–0, నాహిద్ 3–0–12–1, షకీబ్ 6–0–20–0, మిరాజ్ 6–0–16–1.
Comments
Please login to add a commentAdd a comment