BGT 2023: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దిశగా సాగుతుంది. రెండో రోజు లంచ్ సమయానికి భారత్ స్కోర్ 3 వికెట్ల నష్టానికి 151గా ఉండింది. అయితే లంచ్ విరామం తర్వాత తొలి బంతికే టీమిండియాకు భారీ షాక్ తగిలింది. లంచ్ తర్వాత తొలి బంతికే విరాట్ కోహ్లి (26 బంతుల్లో 12; 2 ఫోర్లు) ఔటయ్యాడు. కోహ్లి వికెట్ కూడా ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ ఖాతాలోకే వెళ్లింది. టీమిండియా కోల్పోయిన నాలుగు వికెట్లు ఈ యువ స్పిన్నరే పడగొట్టడం విశేషం.
లెగ్‌సైడ్ వెళ్తున్న బంతిని గ్లాన్స్ చేసే క్రమంలో వికెట్‌కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు కోహ్లి. ఎన్నో అంచనాల నడుమ బరిలోకి దిగిన కోహ్లి ఏ మెరుపులు లేకుండా ఔట్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లి సెంచరీ చేస్తాడని ప్లకార్డులు, బ్యానర్లు రెడీ చేసుకున్న అభిమానులు అతను ఔట్ కాగానే వాటిని దాచేశారు. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనైనా కింగ్ సెంచరీ చేయకపోడా అన్న ఆశతో వారు కనిపించారు.
మరోపక్క కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కో పరుగూ చేస్తూ సెంచరీకి చేరువయ్యాడు. 57 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 163/4గా ఉంది. రోహిత్‌కు (89) జతగా సూర్యకుమార్ యాదవ్ (8) క్రీజ్‌లో ఉన్నాడు. కాగా, ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. టీమిండియా స్పిన్నర్లు రవీంద్ర జడేజా (5/47), రవిచంద్రన్ అశ్విన్ (3/42) ఆసీస్ పతనాన్ని శాసించారు. షమీ, సిరాజ్‌లకు చెరో వికెట్ దక్కింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో లబూషేన్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. స్టీవ్ స్మిత్ (37), హ్యాండ్స్‌కోంబ్ (31), అలెక్స్ క్యారీ (36)లకు మంచి ఆరంభాలే లభించినా, వాటిని భారీ స్కోర్లుగా మలచడంలో వారు విఫలమయ్యారు. ఈ నలుగురు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో ఇంకెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు.
Comments
Please login to add a commentAdd a comment