సలారోడు.. బాక్సాఫీస్‌ని ఊచకోత కోస్తున్నాడు. ప్రభాస్ దెబ్బకు ఫ్యాన్స్ మాస్ జపం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. అయితే తొలిరోజు వసూళ్లతో పలు రికార్డులు సెట్ చేసిన 'సలార్'.. రెండోరోజుకి కాస్త నెమ్మదించింది. ఇంతకీ రెండు రోజుల్లో ఈ సినిమాకు ఎన్ని డబ్బలు వచ్చాయి? అసలేం జరుగుతోంది?
(ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ హిట్ మూవీ.. రెండు నెలల తర్వాత ఇప్పుడు స్ట్రీమింగ్)
డార్లింగ్ ప్రభాస్ చాలా ఏళ్ల తర్వాత చేసిన మాస్ మూవీ 'సలార్'. పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ప్రభాస్ నుంచి 'సాహో' లాంటి మాస్ చిత్రం వచ్చింది. కానీ ఎందుకో ఇది అభిమానుల్ని సంతృప్తి పరచలేకపోయింది. ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్', 'ఆదిపురుష్' ఆడియెన్స్‌ని ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయి. ఇప్పుడు వీళ్లందరినీ 'సలార్' ఫుల్ సాటిస్పై చేస్తోంది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వస్తున్నాయి.
టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజు రూ.178.7 కోట్లు వసూలు చేసిన సలార్.. రెండో రోజు పూర్తయ్యేసరికి 295.7 కోట్ల వసూళ్లు సాధించింది. అంటే తొలిరోజుతో పోలిస్తే శనివారం కలెక్షన్స్ కాస్త తగ్గాయి. సరిగా చెప్పాలంటే రెండో రోజు మాత్రం రూ.117 కోట్ల వరకు ప్రపంచవ్యాప్తంగా సొంతం చేసుకుంది. ఆదివారం కూడా 100 కోట్ల తగ్గకుండా వస్తాయి. వచ్చే వారం పెద్దగా చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు కాబట్టి త్వరలో రూ.1000 కోట్ల మార్క్ దాటేసినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.
(ఇదీ చదవండి: 'సలార్' ఊరమాస్ కలెక్షన్స్.. కొద్దిలో మిస్ అయిన 'ఆర్ఆర్ఆర్' రికార్డ్!)
𝑻𝒉𝒆 𝑯𝒖𝒏𝒕𝒊𝒏𝒈 𝑺𝒆𝒂𝒔𝒐𝒏 𝑩𝒆𝒈𝒊𝒏𝒔…🔥💥#SalaarCeaseFire dominates the global-box office, crossing 𝟐𝟗𝟓.𝟕 𝐂𝐑𝐎𝐑𝐄𝐒 𝐆𝐁𝐎𝐂 (worldwide) 𝐢𝐧 𝟐 𝐃𝐚𝐲𝐬!#BlockbusterSalaar #RecordBreakingSalaar #SalaarRulingBoxOffice#Salaar #Prabhas #PrashanthNeel… pic.twitter.com/suEQftytyj
— Salaar (@SalaarTheSaga) December 24, 2023
Comments
Please login to add a commentAdd a comment