Pushpa2: థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు.. వీడియో వైరల్‌ | Pushpa 2: Women Get Poonakam To Theater After Watching Jatara Episode, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Pushpa2: ‘జాతర’ ఎపిసోడ్‌ ఎఫెక్ట్‌.. థియేటర్స్‌లో మహిళలకు పూనకాలు

Published Sat, Dec 7 2024 5:19 PM | Last Updated on Sat, Dec 7 2024 5:50 PM

Pushpa 2: Women Get Poonakam To Theater After Watching Jatara Episode, Video Goes Viral

ఇండియన్‌ బాక్సాఫీస్‌ని పుష్ప 2 షేక్‌ చేస్తుంది. అల్లు అర్జున్‌ -సుకుమార్‌ కాంబినేషన్‌లో నాలుగో చిత్రంగా తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్‌ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రిమియర్‌ షో నుంచి ఈ మూవీ బ్లాక్‌ బస్టర్‌ టాక్‌ సంపాదించుకుంది. దీంతో తొలి రోజే ఏకంగా రూ. 294 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టి.. ఇండియన్‌ సినీ హిస్టరీలోనే ఫస్ట్‌డే అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన చిత్రంగా రికార్డుకెక్కింది. 

(చదవండి:  పుష్ప చూశాక.. బన్నీ కూడా చిన్నగా కనిపించాడు, ఆర్జీవీ ట్వీట్‌)

ఇక ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు జాతర సీన్‌, క్లైమాక్స్‌ గురించే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా జాతర ఎపిసోడ్‌లో అల్లు అర్జున్‌ నట విశ్వరూపం చూపించాడని చెబుతున్నారు. థియేటర్స్‌లో జాతర ఎపిసోడ్‌ చూస్తే గూస్‌బంప్స్‌ గ్యారెంటీ అంటున్నారు. చెప్పడం కాదు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న కొన్ని వీడియోలు చూస్తుంటే.. సినిమా చూడని వారికి కూడా పూనకాలు వస్తున్నాయి.

(చదవండి: పుష్ప 2 మూవీ రివ్యూ)

థియేటర్‌లో సినిమా చూస్తున్న ఓ మహిళకు.. జాతర ఎపిసోడ్‌ రాగానే నిజంగానే పూనకం వచ్చింది. అమ్మవారు పూనడంతో సీట్లో కూర్చొనే గట్టిగా కేకలు వేస్తూ ఊగిపోయింది. అలాగే మరో మహిళ కూడా  జాతర సీన్‌ చూసి.. పూనకం వచ్చినట్లుగా ప్రవర్తించింది. పక్కన ఉన్నవారి వచ్చి వారిని శాంతింపజేశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్పులను మైత్రీ మూవీ మేకర్స్‌ తమ ఎక్స్‌(ట్విటర్‌) ఖాతాలో షేర్‌ చేయగా..అవి కాస్త వైరల్‌గా మారాయి. 

ఇక పుష్ప 2 విషయానికొస్తే.. సుకుమార్‌ తెరకెక్కించిన ‘పుష్ప ’చిత్రానికి సీక్వెల్‌ ఇది. అల్లు అర్జున్‌కి జోడీగా రష్మిక నటించగా.. ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్ర పోషించాడు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించాడు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement