బిగ్‌బాస్ 8 తెలుగు సీజన్ చివరికొచ్చేసింది. తర్వాత వారంలో ఫినాలే జరగబోతుంది. దీంతో ఈ వీకెండ్ జరగబోయే ఎలిమినేషన్ చివరిది. దీంతో ఎవరు బయటకెళ్లిపోతారా అని ప్రస్తుతం సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తోంది. ప్రస్తుతం హౌసులోని పరిస్థితుల ప్రకారం ఇద్దరమ్మాయిలు డేంజర్ జోన్‌లో ఉన్నారు. వీళ్లలో ఒకరైనా స్టార్ కంటెస్టెంట్ ఈసారి ఎగ్జిట్ పక్కా అని అంటున్నారు.
ఈ వారమంతా హౌసులో విభిన్న రంగాలకు చెందిన పలువురు వ్యక్తులు వచ్చి, హౌసులోని సభ్యులతో కాసేపు ముచ్చట్లు పెట్టి వెళ్లిపోయారు. ఈ వారం అవినాష్ తప్పితే మిగిలిన ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలో నిఖిల్, గౌతమ్ ఏకంగా టైటిల్ రేసులో ఉన్నారు కాబట్టి వీళ్లిద్దరూ ఎలిమినేట్ అయ్యే అవకాశమే లేదు. ప్రేరణ కూడా టాప్-5 రేసులో ఉంది. దీంతో ఈమె కూడా బయటకెళ్లకపోవచ్చు.
(ఇదీ చదవండి: విజయ్ దేవరకొండ పెళ్లి టాపిక్.. తండ్రి ఏమన్నారంటే?)
వీళ్లు కాకుండా అంటే నబీల్, విష్ణుప్రియ, రోహిణి ఉంటారు. కొన్నాళ్ల ముందు వరకు చాలా బ్యాలెన్స్‌గా గేమ్ ఆడుతూ వచ్చిన నబీల్.. ఈ మధ్య కాస్త విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. అయితేనేం టాప్-5కి నబీల్ అర్హుడే అనిపిస్తుంది. ఓటింగ్ పరంగానూ ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే చివరి రెండు స్థానాల్లో రోహిణి, విష్ణుప్రియ ఉన్నారు.
పృథ్వీతో లవ్వాట తప్పితే విష్ణుప్రియ.. ఈ సీజన్ అంతా అంతంత మాత్రంగానే ఫెర్ఫార్మెన్స్ చేస్తూ వస్తోంది. ఈమెతో పోలిస్తే ఎంటర్‌టైన్, గేమ్స్ పరంగా రోహిణి చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఓటింగ్ పరంగా చూసుకుంటే రోహిణి వెళ్లిపోయే అవకాశాలే ఎక్కువ. అదే గేమ్ లెక్కల బయటకు తీస్తే మాత్రం విష్ణుప్రియ.. ఈ వారం ఎగ్జిట్ అయిపోవడం గ్యారంటీ. లేదంటే బిగ్‌బాస్.. గతవారం తేజ, పృథ్వీని పంపినట్లు డబుల్ ఎలిమినేషన్ ఏమైనా ప్లాన్ చేసాడా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'పుష్ప2' టికెట్ల ధరలు తగ్గనున్నాయా.. కారణం ఇదేనా..?)
Comments
Please login to add a commentAdd a comment