Karthik Rathnam
-
Lingoccha Review: ‘లింగొచ్చా’ మూవీ రివ్యూ
టైటిల్:లింగొచ్చా నటీనటులు:కార్తిక్ రత్నం, సుప్యర్ధ సింగ్, ఉత్తేజ్, తాగుబోతు రమేష్, కునాల్ కౌషిక్ . కె, ఫిదా మౌగాల్, ప్రేమ్ సుమన్, భల్వీర్ సింగ్, పటాస్ సద్దామ్, కె. నరసింహ(మిమిక్రి ఆర్టిస్ట్), ఇస్మాయిల్ భాయ్, ఫిష్ వెంకట్, కళా సాగర్, శరత్ కుమార్ తదితరులు నిర్మాణ సంస్థ: నిర్మాత:యాదగిరి రాజు దర్శకుడు: ఆనంద్ బడా సంగీతం: బికాజ్ రాజ్ విడుదల తేది: అక్టోబర్ 27, 2023 కథేంటంటే.. శివ(కార్తిక్ రత్నం) హైదరాబాద్‌కు చెందిన బార్బర్. తన కులవృత్తిని చేస్తూ.. స్నేహితులతో కలిసి తిరుగుతుంటాడు. అతనికి చిన్నప్పటి నుంచే తన ఏరియాకు చెందిన ముస్లిం అమ్మాయి నూర్జహాన్(సుప్యర్థ సింగ్)అంటే చాలా ఇష్టం. తన వయసుతో పాటు నూర్జహాన్పై ప్రేమ కూడా పెరుగుతుంటుంది. కొన్నాళ్లకు నూర్జహాన్ను ఆమె పెరెంట్స్ దుబాయ్‌కి పంపిస్తారు. ఆ విషయం తెలియక శివ.. ఆమె ఇంటి చుట్టూ తిరుగుతుంటాడు. చిన్న వయసులోనే దుబాయ్ వెళ్లిననూర్జహాన్ పెద్దయ్యాక మెడికల్ స్టూడెంట్‌గా తిరిగి హైదరాబాద్‌కు వస్తుంది. ఆ విషయం తెలుసుకున్న శివ..ఆమెకు దగ్గరయ్యేందుకు చాలా ప్రయత్నిస్తాడు.కొన్నాళ్లకు శివ మనసు తెలుసుకున్న నూర్జహాన్.. అతని ప్రేమను అంగీకరిస్తుంది. ఈ విషయంలో ఆమె ఇంట్లో తెలియడంతో వేరే వ్యక్తితో పెళ్లి ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? నూర్జహాన్ సింగిల్‌గా ఎందుకు దుబాయ్‌కి వెళ్లాల్సి వచ్చింది? ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోవడంతో శివ ఏం చేశాడు? చివరకు వీరిద్దరు ఒకటయ్యారా లేదా? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. హైదరాబాద్ నేటివిటి స్టొరీతో సినిమా వచ్చి చాలా కాలమైంది. గతంలో హైదరాబాద్ నేపథ్యంలో హైదరాబాది నవాబ్స్, అంగ్రేజ్ సినిమాలు వచ్చి మంచి విజయం సాధించాయి. చాలా కాలం తర్వాత మళ్లీ అలాంటి నేపథ్యంతో వచ్చిన చిత్రం లింగోచ్చా. పాతబస్తీ నేపథ్యంతో సాగే ఓ మంచి ప్రేమ కథా చిత్రమిది. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ..దాన్ని తెరపై చూపించడంలో కాస్త తడబడ్డాడు. చాలా సన్నివేశాలు గత ప్రేమకథా చిత్రాలను గుర్తు చేస్తాయి. దీంతో ఓ ఫ్రెష్ లవ్‌స్టోరీని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగదు. అయితే హైదరాబాదీ నేపథ్యం.. హిందీ, ఉర్తూ, తెలుగు మిక్స్ డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా చేస్తాయి. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ మధ్య జరిగే కామెడీ సంభాషణతో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెంటనే శివ, నూర్జహాన్ చైల్డ్ ఎపిసోడ్‌తో అసలు కథ ప్రారంభం అవుతుంది. అయితే ఈ చైల్డ్ ఎపిసోడ్ కాస్త సాగదీతగా అనిపిస్తుంది. నూర్జహాన్ దుబాయ్ నుంచి తిరిగి వచ్చి ఎంబీబీఎస్ కాలేజీలో చేరిన తర్వాత కథనం ఆసక్తికరంగా సాగుతుంది. తను ప్రేమించిన అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం శివ చేసే ప్రయత్నాలు కాస్త నవ్విస్తాయి. కానీ ఆ సీన్లతో కొత్తదనం కనిపించదు. ఇక సెకండాఫ్‌లో కూడా చాలా సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కానీ చివరి 20 నిమిషాలు మాత్రం అందరూ కథలో లీనమైపోతారు. ఫ్రీక్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు కథను నడించిన విధానం బాగుంది. నటీనటుల నుంచి, సాంకేతిక వర్గం నుంచి మంచి ఔట్‌ఫుట్ రావడంతో దర్శకుడు పాసయ్యాడు. కానీ కథ, కథనంపై ఇంకాస్త ఫోకస్ పెట్టి.. కొత్త ప్రజెంట్ చేసి ఉంటే ‘లింగోచ్చా’ ఫలితం మరోలా ఉండేది. ఎవరెలా చేశారంటే.. కార్తిక్ రత్నం మంచి నటుడు. ఎలాంటి పాత్రలో అయినా జీవించేశాడు. ఈ చిత్రంలో కూడా పాతబస్తీకి చెందిన నాయి బ్రాహ్మణుడు శివ పాత్రలో ఒదిగిపోయాడు. డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్స్ కూడా ఇరగదీశాడు. ఇక ముస్లిం యువతి నూర్జహాన్గా సుప్యర్థ సింగి తన పాత్ర పరిధిమేర చక్కగా నటించింది. తెరపై అందంగా కనిపించింది. తాగుబోతు రమేష్, ఉత్తేజ్ లు స్టోరి నేరేటర్స్ గా మెప్పించారు. మిగతా నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాలకొస్తే.. బికాజ్ రాజ్ నేపథ్య సంగీతం బాగుంది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫి ఈ మూవీకి ప్లస్ అయింది. హైదరాబాద్ అందాలను తెరపై అద్భుతంగా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువల సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
'ఛాంగురే బంగారు రాజా' సినిమా రివ్యూ
టైటిల్: ఛాంగురే బంగారు రాజా నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు తదితరులు నిర్మాణ సంస్థ: ఆర్టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాత: రవితేజ దర్శకత్వం: సతీశ్ వర్మ సంగీతం: కృష్ణ సౌరభ్ సినిమాటోగ్రఫీ: సుందర్ NC విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023 కథేంటి? అనకాపల్లి దగ్గర్లోని ఓ పల్లెటూరిలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) బైక్ మెకానిక్. అదే ఊరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మంగ(గోల్డీ నిస్సీ)ని ప్రేమిస్తుంటాడు. ఓ సందర్భంలో రంగు రాళ్ల విషయమై సోము నాయుడు (రాజ్ తిరందాసు)-బంగార్రాజుకి గొడవ జరుగుతుంది. తర్వాత రోజే సోము నాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో ఆ నేరం బంగార్రాజుపై పడుతుంది. ఇంతకీ సోము నాయుడిని చంపిందెవరు? ఈ స్టోరీలో తాతారావు (సత్య), గాటీ (రవిబాబు) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే 'ఛాంగురే బంగారు రాజా' స్టోరీ. (ఇదీ చదవండి: Ramanna Youth Review: ‘రామన్న యూత్’ మూవీ రివ్యూ) ఎలా ఉందంటే? సింపుల్‌గా చెప్పుకుంటే ఈ సినిమా లైన్.. ఓ హత్య, దాని వెనక మిస్టరీ. తనపై మోపిన నేరం వెనుక దాగి ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చాలనుకున్న ఓ యువకుడి స్టోరీ ఇది. ఈ తరహా కథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు.. ఆడియెన్స్ ని ఎంతవరకు థ్రిల్ చేశారు? లేదా ఎంత నవ్వించారు? అనే పాయింట్స్ మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 'ఛాంగురే బంగారు రాజా' విషయంలో డైరెక్టర్ కి పాస్ మార్కులే వేయొచ్చు. ఎందుకంటే సినిమాలో కామెడీ తప్పితే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. క్లైమాక్స్ ముందు ఓ ఛేజింగ్ సీన్ చూస్తున్నప్పుడు.. అప్పటికీ మూవీ ల్యాగ్ అయిన అనుభూతి వస్తుంది. అయితే కొత్త దర్శకుడు కావడం వల్ల దీన్ని పూర్తిస్థాయి సినిమాగా తీయడంలో దర్శకుడు తడబడ్డాడు. సినిమాని ఓ సంఘటన, మూడు చాప్టర్లు అని ముందే చెప్పేసిన దర్శకుడు.. ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ కూడా పెద్దగా కొత్తగా ఏం ఉండవు. మళ్లీ మళ్లీ అవే సీన్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది. మంచి కామెడీ, సెంటిమెంట్, థ్రిల్ కలిగించడానికి సినిమాలో స్కోప్ ఉన్నా సరే రైటింగ్ లో బలం లేకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ డల్ గా అలా వెళ్తుంటాయి. సత్య, రవిబాబు కామెడీతో పాటు సునీల్ గొంతుతో వినిపించే కుక్క సీన్స్ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో సత్య లవ్ స్టోరీ కూడా నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్‌లో రవిబాబు ఎంట్రీ తర్వాత సినిమా ఫన్వేలో ముందుకు సాగుతుంది. మతిమరుపుతో రవిబాబు పండించిన కామెడీ వర్కౌట్ అయింది. హీరోని చంపేందుకు ఓ వ్యక్తి ఎందుకు ప్రయత్నిస్తున్నాడనేది చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు. దర్శకుడు కొత్త నేపథ్యంతో కథను చెప్పాడు కానీ.. దాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. మిగతా విషయాల గురించి పక్కనబెడితే రంగురాళ్ల కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించింది. ఎవరెలా చేశారు? కేరాఫ్ కంచరపాలెం, నారప్ప తదితర సినిమాల్లో కార్తీక్ రత్నం.. నటుడిగా తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏ యాక్టర్ కి అయినా సరైన పాత్రలు పడితే అతడిలో సత్తా బయటకొస్తుంది. ఈ మూవీలో కార్తీక్ ఓకే అనిపించాడు. లవ్ సీన్స్ లో ఎమోషన్, నేరం మోపిన సీన్స్ లో సింపతీ వర్కౌట్ కాలేదు. సత్య, రవిబాబు.. తమ కామెడీ టైమింగ్ చూపించి ఫలితం లేకుండా పోయింది. అయితే టెక్నికల్ విషయాలకొస్తే... సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కి ఇంకా పనిచెప్పాల్సింది. ఆర్టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -రేటింగ్: 2.75 (ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్) -
నా కల నెరవేరుతోంది
‘‘ఛాంగురే బంగారురాజా’ కుటుంబంతో కలిసి హాయిగా చూడదగ్గ సినిమా. ఇందులో మంగరత్నం అనే పోలీస్ కానిస్టేబుల్ పాత్ర చేశాను. మెకానిక్ బంగార్రాజుగా కార్తీక్ నటించారు. మా ఇద్దరి మధ్య ప్రేమ ప్రయాణం చాలా సరదాగా ఉంటుంది. రవితేజగారి నిర్మాణంలో నా మొదటి సినిమా చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను’’ అని హీరోయిన్ గోల్డీ నిస్సీ అన్నారు. కార్తీక్ రత్నం హీరోగా సతీష్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. రవితేజ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోల్డీ నిస్సీ మాట్లాడుతూ–‘‘నేను తెలుగమ్మాయిని. కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేశాను. హీరోయిన్గా నా తొలి సినిమా ‘ఛాంగురే బంగారురాజా’. రవితేజగారిని కలిసినప్పుడు ‘సినిమా చూశాను. నీకు ఇది తొలి సినిమా అయినా భయం లేకుండా నటించావ్’ అని మెచ్చుకోవడం హ్యాపీ. నన్ను నేను పెద్ద తెరపై చూసుకోవాలనే కల నెరవేరుతుండటం చాలా ఎగ్జయిటింగ్‌గా ఉంది’’ అన్నారు. -
ఛాంగురే బంగారురాజాని ఎంజాయ్ చేస్తారు: రవితేజ
‘‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు నచ్చింది. ఈ కథని సతీష్ చెబుతున్నంత సేపు నాకు ‘లేడీస్ టైలర్’ సినిమా, దర్శకులు వంశీ గుర్తొచ్చారు. ఆయనతో నేను ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చేశాను. అలాంటి వినోదం ‘ఛాంగురే బంగారు రాజా’లో ఉందనిపించింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’. సతీష్ వర్మ దర్శకత్వంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘కార్తీక్ రత్నం ఇందులో మంచి ఎంటర్టైనింగ్ రోల్ చేశాడు. నా టీమ్ సభ్యులపై నమ్మకంతో నేను ఒక్కరోజు కూడా ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లలేదు.. ఈ మూవీ విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు. ‘‘ప్రతిభా వంతులను, కష్టపడేవారిని రవితేజగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. సతీష్ వర్మతో నాకు పదేళ్ల పరిచయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘శ్రీనువైట్లగారి నుంచి మొదలుపెడితే వంశీ వరకు చాలామంది కొత్త దర్శకులను అన్నయ్య(రవితేజ) ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులనే కాదు.. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తారు. ఆయన సినిమాలపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి. అలా అన్నవాళ్లు పడిపోయారు కానీ అన్నయ్య అలానే ఉన్నారు. ‘ఇడియట్’ మూవీలోలా ‘ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు.. వెళ్తుంటారు. రవితేజ మాత్రం ఇక్కడే ఇలానే ఉంటారు’’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. ‘‘నేను హీరోగా రవితేజగారు సినిమాను నిర్మించారనే ఆ స్పెషల్ మూమెంట్ లోనే ఇంకా నేను ఉన్నాను’’ అన్నారు కార్తీక్ రత్నం. ‘‘కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది’’ అన్నారు సతీష్ వర్మ. ఈ వేడుకలో దర్శకులు వెంకటేష్ మహా, కేవీ అనుదీప్, సందీప్ రాజ్, వంశీ, కృష్ణ చైతన్య, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శరత్ మరార్, ఎస్‌కేఎ¯Œ , చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడారు. -
ఒక ఎపిసోడేని మాత్రమే ఫ్రీగా ఎందుకు చూపిస్తున్నాం అంటే..
-
చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీపుపై నేను చేతులు పెట్టను.. ఇంట్రస్టింగ్‌గా టీజర్
కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా, రవిబాబు, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఛాంగురే బంగారు రాజా. సతీష్ వర్మ దర్శకుడు. హీరో రవితేజ ఆర్టీ టీమ్ వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ పతాకాలపై శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వర్క్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం రవితేజ విడుదల చేశారు. సునీల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్లో 'నా చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీపుపై నేను చేతులు పెట్టను', 'ఆ మర్డర్ చేసింది నేను కాదు' అనే డైలాగ్స్ ఉన్నాయి. ఓ కుక్క, ముగ్గురు వ్యక్తులు ఓ హత్య కేసును చేధించడంలో ఎలా భాగస్వాములయ్యారు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా టీజర్ సాగుతుంది. ఈ సినిమాకు సంగీతం:కృష్ణ సౌరభ్, కెమెరా: సుందర్ ఎన్‌సి. -
తండ్రి, కొడుకుల మధ్య ఎమెషనల్ స్టోరీ.. సినిమాకు శ్రీకారం
Karthik Rathnam Hrithika Srinivas Movie: బెక్కం మాధవి, బెక్కం ప్రొడక్షన్స్ సమర్పణలో శ్రీ శ్రీనివాస స్క్రీన్స్ బ్యానర్ పై కొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. కార్తిక్ రత్నం, హ్రితిక శ్రీనివాస్, పృథ్వీ (పెళ్లి సినిమా ఫేమ్), కాలకేయ ప్రభాకర్, మహేంద్రనాద్, సిఎంఆర్. శర్మ, కాళిచరణ్ సంజయ్ నటీ నటులుగా అరుణ్ కొత్తపల్లి దర్శకుడుగా పరిచయమవుతున్నారు. బెక్కం రవీందర్ నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెంబర్-1 సినిమా పూజా కార్యక్రమాలు ఆదివారం (జులై 10) ఉదయం విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన స్టార్ మేకర్ సత్యానంద్.. చిత్ర హీరో, హీరోయిన్స్ పై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. మహేందర్ చక్రవర్తి కెమెరా స్విచ్చాన్ చేశారు. చిత్ర దర్శకుడు అరుణ్ కొత్తపల్లి గౌరవ దర్శకత్వం వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాత బెక్కం రవీందర్ మాట్లాడుతూ.. 'స్టార్ మేకర్ సత్యానంద్ ఎంతో బిజీగా ఉన్నా మేము అడిగిన వెంటనే మమ్మల్ని, మా సినిమాను ఆశీర్వదించడానికి వచ్చినందుకు వారికి నా ధన్యవాదాలు. చిత్ర దర్శకుడు కొత్తవారైనా బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఫాదర్, సన్ ల మధ్య జరిగే ఏమోషనల్, క్రైమ్ కామెడీ స్టోరీ నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాను.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ను ఈ రోజు నుంచి పది రోజులు వైజాగ్ లోని పలు అందమైన లొకేషన్స్ లలో షూటింగ్ నిర్వహిస్తాం. ఆ తరువాత జరిగే రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేస్తాం. నటీనటులు, టెక్నిషియన్స్ అందరూ మా సినిమాకు చాలా చక్కగా కుదిరారు. మంచి కథతో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుంది' అని తెలిపారు. -
'నారప్ప' నటుడు కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు వైరల్
నారప్ప నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శనివారం ఆయన నిశ్వితార్ధం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు, సన్నిహితుల, సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే ఆయన కాబోయే భార్య గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా కేరాఫ్ కంచరపాలెం సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిని కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్ అయ్యాడు. ఈ చిత్రంలో మునికన్నగా నటించి ప్రశంసలు అందుకున్నాడు. కనిపించే కాసేపు అయినా తన స్క్రీన్ ప్రెజన్స్‌తో ఆకట్టుకున్నాడు. రీసెంట్గా అర్థశతాబ్ధం సినిమాలో నటించాడు. -
‘అర్థ శతాబ్దం’మూవీ రివ్యూ
టైటిల్ : అర్థ శతాబ్దం నటీనటులు : కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ, నవీన్ చంద్ర, సాయికుమార్, శుభలేఖ సుధాకర్ ఆమని తదితరులు నిర్మాణ సంస్థ : రిషితా శ్రీ క్రియేషన్స్ ఎల్ఎల్పీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ దర్శకత్వం : రవీంద్ర పుల్లె సంగీతం : నోఫెల్ రాజా సినిమాటోగ్రఫీ : అస్కర్, వెంకట్, ఈజే వేణు ఎడిటింగ్ : జె.ప్రతాప్ కుమార్ విడుదల తేది : జూన్ 11, 2021(ఆహా) సీరియస్ కథాంశాలతో తెరకెక్కె చిత్రాలు ఇటీవల టాలీవుడ్లో ఎక్కువయ్యాయి. నూతన దర్శకులు కొత్త కొత్త ప్రయోగాలతో వెండి తెరకు ఎంట్రీ ఇస్తున్నారు. వినూత్న కథాంశంతో సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలను ఇష్టపడుతున్నారు. ఇలాంటి ఒక సీరియస్ కథాంశంతోనే తెరకెక్కిన చిత్రం ‘అర్థ శతాబ్దం’. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై ఆసక్తి పెంచింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా థియేటర్లో విడుదల కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటీటీ బాటపట్టింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(జూన్ 11)ప్రముఖ ఓటీటీ ఆహా విడుదలైన ‘అర్థ శతాబ్దం’ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథ సిరిసిల్ల గ్రామానికి చెందిన కృష్ణ (కార్తీక్ రత్నం) చదువు పూర్తి చేసి, ఊళ్లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా దుబాయ్ వెళ్లి బాగా సంపాదించి, తల్లిని, చెల్లిని బాగా చూసుకోవాలని అతని కోరిక. ఆయనకు అదే గ్రామానికి చెందిన మాజీ నక్సలైట్ రామన్న(సాయికుమార్) కూతురు పుష్ప(కృష్ణ ప్రియ)అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అయితే తన ప్రేమను ఆమెతో పంచుకోలేకపోతాడు. అతని వయసుతో పాటు పుష్పపై ప్రేమ కూడా పెరుగుతూ వస్తుంది. తన మనసులోని మాటను పుష్పతో చెప్పాలని చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో కృష్ణ చేసిన ఓ పని ఊర్లో గొడవలకు దారి తీస్తుంది. అసలు కృష్ణ చేసిన పని ఏంటి? దాని వల్ల ఆ ఊళ్లో ఎలాంటి దారుణ పరిస్థితులు ఎదురయ్యాయి? వీరి ప్రేమకి కులాల మధ్య కుమ్ములాటకి సంబంధం ఏంటి? చివరకు పుష్ప ప్రేమని కృష్ణ పొందాడా లేదా? అనేదే మిగతా కథ. నటీనటులు ‘కేరాఫ్ కంచరపాలెం’లో జోసెఫ్‌గా నటించి ఆకట్టుకున్న కార్తీక్ రత్నం ఇందులోనూ తనదైన నటనతో మెప్పించాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు కృష్ణ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక హీరోగా కాకుండా, విలేజ్‌కి చెందిన అబ్బాయిగా చాలా సహజంగా తన పాత్ర సాగుతోంది. లవర్ బాయ్‌గా జోష్‌గా కనిపిస్తూ.. బావోధ్వేగ నటనను ప్రదర్శించాడు. ఇక పల్లెటూరికి చెందిన పుష్ప పాత్రకు పూర్తి న్యాయం చేసింది కృష్ణప్రియ. సంప్రదాయ దుస్తుల్లో తెరపై అందంగా కనిపించింది. మాజీ నక్సటైట్ రామన్నగా సాయికుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వ్యవస్థపై చిరాకు పడే ఎస్సై రంజిత్‌గా నవీన్ చంద్ర పర్వాలేదనిపించాడు. ఆమని, శుభలేఖ సుధాకర్ తదితరులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు. విశ్లేషణ విప్లవం, కులాల మధ్య గొడవలు, వర్గ పోరు, శ్రమదోపిడి లాంటి నేపథ్యంతో వెండితెరపై ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటికి ప్రేమ, కమర్షియల్ హంగులు జోడించి విజయం అందుకున్న చిత్రాలు చాలానే ఉనాయి. అయితే ఇలాంటి కథలను డీల్ చేయడం కత్తిమీద సాము లాంటిదే. కొంచెం తేడా వచ్చిన మొదటికే మోసం వస్తుంది. ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నామో.. దానిని బలంగా తెరపై చూపించాలి. ఆయా సన్నివేశాలు ప్రేక్షకుడి భావోద్వేగాల్ని తట్టిలేపాలి. అప్పుడే సినిమా సక్సెస్ అవుతుంది. ఈ విషయంలో అర్ధశతాబ్దం దర్శకుడు రవీంద్ర పుల్లె కాస్త తడబడ్డాడు. కుల వ్యవస్థ, వర్గ పోరాటం, రాజ్యాంగం.. అంటూ బలమైన విషయాల్నే ఎంచుకొని, దాన్ని తెరపై చూపించడంలో విఫలమయ్యాడు. మనిషి పుట్టుక మొదలు.. ప్రేమ, కులం, రాజకీయం, రాజ్యాంగం వరకు చాలా విషయాలకు తెరపై చూపించాలనుకొని, దేనికి పూర్తి న్యాయం చేయలేదేమో అనిపిస్తుంది. ఫస్టాఫ్ అంతా కృష్ణ ప్రేమ చుట్టే తిరుగుతుంది. పుష్పపై ఉన్న ప్రేమను వ్యక్తం చేయడానికి కృష్ణ పడే ఆరాటం, రోటీన్ సన్నివేశాలతో నెమ్మదిగా సా..గుతోంది. ఇక సెకండాఫ్‌లో అయినా కథ సీరియస్ టర్న్ తీసుకొని ఏవైనా ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయా అని ఆశపడే ప్రేక్షకుడి నిరాశే మిగులుంది. ఎవరు ఎవరిని చంపుతున్నారో ఎవరికీ అర్థం కాదు. ఒక గ్రామంలో ఇంత జరుగుతున్నా.. మంత్రి(శుభలేఖ సుధాకర్), డీఎస్పీ(అజయ్) ఇద్దరు టీ తాగుతూ పిట్టకథలు చెప్పుకోవడం అంత కన్విసింగ్‌గా అనిపించదు. సినిమా మూలాన్ని కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణలతో ముంగించారు. సాయికుమార్, శుభలేఖ సుధాకర్, నవీన్ చంద్ర అజయ్, ఆమని, పవిత్ర వంటి అగ్ర నటులు ఉన్నా వారిని సరిగా వాడుకోలేకపోయాడు. ఇక సహజత్వం కోసం అసభ్య పదజాలాన్ని యదేచ్ఛగా వాడేశారు. రక్తపాతం, హింస మరీ ఎక్కువైంది. క్లైమాక్స్ లో..‘గతించిన క్షణాలన్నీ, గ్రంధాలుగా లిఖించబడినరోజున…కలవని అడుగులన్నీ కలయికగా కలబడే రోజు.. గెలువని ప్రేమలు అన్ని స్మృతులుగా పిలవబడే రోజున.. రాయని అక్షరాలని రాజ్యాంగంగా రాయబడిన రోజున.. మనిషిలో జనించిన ప్రేమ, మనిషిని జయించిన కులాన్ని చిల్చిన రోజున పుడతాను పువ్వునై మరలా ఈ పుడమిలోనే’అనే భారీ ఎమోషనల్ డైలాగ్ సగం అర్థమై, అర్థం కానట్లుగానే ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమాకు ప్రధాన బలం నోఫెల్ రాజా సంగీతం బాగుంది. ‘ఏ కన్నులు చూడని’పాట సినిమాకి హైలెట్ అని చెప్పొచ్చు. నేపథ్య సంగీతం బాగుంది. అస్కర్, వెంకట్, ఈజే వేణుల సినిమాటోగ్రఫీ బాగుంది. పల్లె అందాలను, ప్రేమ సన్నివేశాలను చక్కగా చూపించారు. ప్రతాప్ కుమార్ ఎడిటింగ్‌కు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ కార్తీక్ రత్నం, కృష్ణ ప్రియ నటన దర్శకుడు ఎంచుకున్న పాయింట్ నేపథ్య సంగీతం, పాటలు మైనస్ పాయింట్స్ ఫస్టాప్ అగ్రనటీనటులను సరిగా ఉపయోగించుకోలేకపోవడం మోతాదు మించిన రక్తపాతం, హింస బలమైన సన్నీవేశాలు లేకపోవడం -అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్
కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్దం’. 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సినిమాకి సంబంధించి ‘అరె మెరిసెలే.. మెరిసెలే.. మిలమిల మెరిసెలే’ అంటూ సాగే లిరికల్ సాంగ్ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పాటకి రహ్మన్ సాహిత్యం అందించగా, శంకర్ మహదేవన్ శ్రావ్యంగా ఆలపించారు. నవ్ఫాల్ రాజా ఎఐఎస్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఏ కన్నులు చూడనీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందినట్లు ఇటీవలే విడుదలైన ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. చదవండి: ఆసక్తికరంగా ‘అర్ధ శతాబ్దం’ట్రైలర్ -
Ardha Shathabdam: పువ్వు కోసం కొట్టుకుచస్తున్నారంటే..
24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై కార్తిక్ రత్నం, కృష్ణప్రియ ప్రధాన పాత్రల్లో, సాయి కుమార్, అజయ్, ఆమని, పవిత్ర లోకేష్, శరణ్య నటిస్తోన్న చిత్రం అర్ధ శతాబ్దం. ఈ మూవీకి రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తుండగా చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ‘ఈ విశాల సృష్టిలో మనిషి కన్నా ముందు ఎన్నో జీవరాశులుండేవి. ఒకానొక రాక్షస ఘడియలో మానవ జాతి పుట్టుక సంభవించింది’ అని శుభలేఖ సుధాకర్ చెప్పే డైలాగ్‌లో ట్రైలర్ ప్రారంభమవుతుంది. మధ్యలో ఓ ప్రేమ కథ, ఓ గ్రామంలోని ఇరు వర్గాల ఘర్షణలతో ఆసక్తి పెంచుతోంది. తెలంగాణలో కుగ్రామ మూలాల్లోని రాజకీయాలకు, కుల వ్యవస్థకు మధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ‘ఒక్క పువ్వు కోసం కొట్టుకు చస్తున్నారంటే నీకెందుకయ్యా అంత ఆశ్చర్యం, ‘ఈ 50 ఏళ్ల స్వాతంత్ర్యం దేని కోసమో, ఎవరి కోసమో ఇప్పటి వరకూ ఎవరికీ అర్థం కాలేదు’అని శుభలేక సుధాకర్ చెప్పే డైలాగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి. సాయి కుమార్, ఆమని, పవిత్ర లోకేశ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. -
ఆహాలో రిలీజవుతోన్న 'అర్ధ శతాబ్దం'
కార్తీక్ రత్నం, నవీన్ చంద్ర, సాయి కుమార్, కృష్ణ ప్రియ, సుహాస్, పవిత్రా లోకేష్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహించారు. చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26 నుంచి ‘ఆహా’లో స్ట్రీమ్ కానుంది. రవీంద్ర పుల్లే మాట్లాడుతూ– జాతి, మత, వర్ణ వివక్షకు వ్యతిరేకంగా ఈ చిత్రం ఉంటుంది. ప్రేమ కోసం జరిగే పోరాటంతో పాటు రాజకీయాలు, కులాల మధ్య జరిగిన వివాదాల నేపథ్యంలో 2003లో జరిగిన కథే ‘అర్ధ శతాబ్దం’. 1950 నుండి 2003 వరకు ఈ కథ జరుగుతుంది’’ అన్నారు. ‘‘మా ‘అర్ధ శతాబ్దం’’ చిత్రాన్ని ఆదరించి సపోర్ట్‌గా నిలిస్తే మరిన్ని చిత్రాలు నిర్మిస్తాం’’ అన్నారు చిట్టి కిరణ్. రాధాకృష్ణ మాట్లాడుతూ– ‘‘22ఏళ్లుగా నటుడిగా ఉన్నాను. ‘అర్ధ శతాబ్దం’ కథ నచ్చడంతో రవీంద్ర, కిరణ్‌లతో భాగస్వామ్యం అయ్యాను. ‘ఆహా’ ద్వారా ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళితో ఆ తర్వాత మరిన్ని చిత్రాలు నిర్మించవచ్చని భావించి ‘ఆహా’లో విడుదల చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వెంకట్ ఆర్. శాఖమూరి, అష్కర్, ఇ.జె వేణు, సంగీతం: నోఫెల్ రాజ. చదవండి: ‘జాతిరత్నాల’మధ్య చిచ్చు... నవీన్, దర్శిలకు రాహుల్ వార్నింగ్ -
పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చిన ‘ఎర్రానీ సూరీడే’ పాట
‘కేరాఫ్ కంచరపాలెం’ఫేమ్ కార్తీక్‌రత్నం, నవీన్‌చంద్ర, కృష్ణప్రియ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎర్రానీ సూరీడే’ అంటూ సాగే పాటను యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ శుక్రవారం విడుదల చేశారు. అచ్చమైన పల్లె వాతావరణాన్ని, కులవృత్తుల గురించి తెలియజేస్తూ సాగుతున్న ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. ఈ పాటకు లక్ష్మి ప్రియాంక సాహిత్యం సమకూర్చగా మోహన భోగరాజు ఆలపించారు. నౌఫల్‌రాజా సంగీతం అందించారు. వీర్ ధర్మిక్ సమర్పణలో రిషిత శ్రీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 26న సినిమా ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదల కానుంది.