సతీష్ వర్మ, కార్తీక్ రత్నం, రవితేజ, శ్రీవిష్ణు, హరీష్ శంకర్, గోల్డీ నిస్సీ
‘‘ఛాంగురే బంగారురాజా’ టైటిల్ నాకు నచ్చింది. ఈ కథని సతీష్ చెబుతున్నంత సేపు నాకు ‘లేడీస్ టైలర్’ సినిమా, దర్శకులు వంశీ గుర్తొచ్చారు. ఆయనతో నేను ‘ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ సినిమా చేశాను. అలాంటి వినోదం ‘ఛాంగురే బంగారు రాజా’లో ఉందనిపించింది. ఈ సినిమాను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు హీరో రవితేజ. కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా నటించిన చిత్రం ‘ఛాంగురే బంగారురాజా’.
సతీష్ వర్మ దర్శకత్వంలో ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న రిలీజ్‌కానుంది. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో దర్శకుడు హరీష్ శంకర్ చిత్ర ట్రైలర్‌ని విడుదల చేశారు. రవితేజ మాట్లాడుతూ– ‘‘కార్తీక్ రత్నం ఇందులో మంచి ఎంటర్‌టైనింగ్ రోల్ చేశాడు. నా టీమ్ సభ్యులపై నమ్మకంతో నేను ఒక్కరోజు కూడా ఈ సినిమా షూటింగ్‌కి వెళ్లలేదు.. ఈ మూవీ విజయం సాధించి అందరికీ మంచి పేరు రావాలి’’ అన్నారు.
‘‘ప్రతిభా వంతులను, కష్టపడేవారిని రవితేజగారు ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటారు. సతీష్ వర్మతో నాకు పదేళ్ల పరిచయం. ఈ సినిమా విజయం సాధించాలి’’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ‘‘శ్రీనువైట్లగారి నుంచి మొదలుపెడితే వంశీ వరకు చాలామంది కొత్త దర్శకులను అన్నయ్య(రవితేజ) ఇండస్ట్రీకి పరిచయం చేశారు. దర్శకులనే కాదు.. సాంకేతిక నిపుణులు, ఆర్టిస్టులను కూడా ప్రోత్సహిస్తారు. ఆయన సినిమాలపై అప్పుడప్పుడు విమర్శలు వస్తుంటాయి.
అలా అన్నవాళ్లు పడిపోయారు కానీ అన్నయ్య అలానే ఉన్నారు. ‘ఇడియట్’ మూవీలోలా ‘ఇండస్ట్రీకి ఎందరో వస్తుంటారు.. వెళ్తుంటారు. రవితేజ మాత్రం ఇక్కడే ఇలానే ఉంటారు’’ అన్నారు దర్శకుడు హరీష్ శంకర్. ‘‘నేను హీరోగా రవితేజగారు సినిమాను నిర్మించారనే ఆ స్పెషల్ మూమెంట్ లోనే ఇంకా నేను ఉన్నాను’’ అన్నారు కార్తీక్ రత్నం. ‘‘కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేసే ఫిల్మ్ ఇది’’ అన్నారు సతీష్ వర్మ. ఈ వేడుకలో దర్శకులు వెంకటేష్ మహా, కేవీ అనుదీప్, సందీప్ రాజ్, వంశీ, కృష్ణ చైతన్య, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, శరత్ మరార్, ఎస్‌కేఎ¯Œ , చిత్రయూనిట్ సభ్యులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment