![Ravi Teja Released Changure Bangaru Raja Teaser - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/27/changure-bangaru-raja.jpg.webp?itok=yu0S3F9U)
కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ జంటగా, రవిబాబు, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ఛాంగురే బంగారు రాజా. సతీష్ వర్మ దర్శకుడు. హీరో రవితేజ ఆర్‌టీ టీమ్ వర్క్స్, ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ పతాకాలపై శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్స్‌గా వర్క్ చేశారు. త్వరలో విడుదల కానున్న ఈ సినిమా టీజర్‌ను బుధవారం రవితేజ విడుదల చేశారు.
సునీల్ వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయ్యే ఈ టీజర్‌లో 'నా చేతిలో డబ్బులు పడితే కానీ మీ జీపుపై నేను చేతులు పెట్టను', 'ఆ మర్డర్ చేసింది నేను కాదు' అనే డైలాగ్స్ ఉన్నాయి. ఓ కుక్క, ముగ్గురు వ్యక్తులు ఓ హత్య కేసును చేధించడంలో ఎలా భాగస్వాములయ్యారు? అసలు హంతకుడు ఎవరు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా టీజర్ సాగుతుంది. ఈ సినిమాకు సంగీతం:కృష్ణ సౌరభ్, కెమెరా: సుందర్ ఎన్‌సి.
Comments
Please login to add a commentAdd a comment