Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్‌ | Ardha Shathabdam: Merisaley Lyrical Song Out | Sakshi
Sakshi News home page

Ardha Shathabdam: ఆకట్టుకుంటున్న ‘మెరిసేలే మెరిసేలే’ సాంగ్‌

Published Sat, Jun 5 2021 9:06 PM | Last Updated on Sat, Jun 5 2021 9:43 PM

Ardha Shathabdam: Merisaley Lyrical Song Out - Sakshi

కేరాఫ్ కంచెరపాలెం ఫేం కార్తీక్ రత్నం- కృష్ణ ప్రియ ప్రధాన పాత్రలో డైరెక్టర్ రవీంద్ర పుల్లే తెరకెక్కిస్తున్న చిత్రం ‘అర్థ శతాబ్దం’. 24 ఫ్రేమ్స్‌ సెల్యూలాయిడ్‌, రిషిత శ్రీ క్రియేషన్స్ పతాకంపై చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణలు నిర్మిస్తున్న ఈ చిత్రంలో అందాల రాక్షసి ఫేం నవీన్ చంద్ర పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్‏కు మంచి రెస్పాన్స్ వచ్చింది.  

 తాజాగా సినిమాకి సంబంధించి ‘అరె మెరిసెలే.. మెరిసెలే.. మిలమిల మెరిసెలే’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ ఒకటి విడుదలై ఆకట్టుకుంటోంది. ఈ పాటకి రహ్మన్‌ సాహిత్యం అందించగా, శంకర్‌ మహదేవన్‌ శ్రావ్యంగా ఆలపించారు. నవ్‌ఫాల్ రాజా ఎఐఎస్ సంగీతం సమకూర్చారు.

 ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఏ కన్నులు చూడనీ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.  తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే గొడవలే ప్రధాన అంశంగా ఈ చిత్రం రూపొందిన‌ట్లు ఇటీవలే విడుదలైన ట్రైలర్‌ చూస్తే అర్థమ‌వుతుంది.  సాయి కుమార్‌, ఆమని, పవిత్ర లోకేశ్‌, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన‌ ఈ సినిమా జూన్ 11 నుంచి ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. 


చదవండి:
ఆసక్తికరంగా ‘అర్ధ శతాబ్దం’ట్రైలర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement