
‘కేరాఫ్ కంచరపాలెం’ఫేమ్ కార్తీక్‌రత్నం, నవీన్‌చంద్ర, కృష్ణప్రియ, సాయికుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం‘అర్ధ శతాబ్దం’. రవీంద్ర పుల్లే దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్, టీజర్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఎర్రానీ సూరీడే’ అంటూ సాగే పాటను యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ శుక్రవారం విడుదల చేశారు. అచ్చమైన పల్లె వాతావరణాన్ని, కులవృత్తుల గురించి తెలియజేస్తూ సాగుతున్న ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది.
ఈ పాటకు లక్ష్మి ప్రియాంక సాహిత్యం సమకూర్చగా మోహన భోగరాజు ఆలపించారు. నౌఫల్‌రాజా సంగీతం అందించారు. వీర్ ధర్మిక్ సమర్పణలో రిషిత శ్రీ, 24 ఫ్రేమ్స్ సెల్యూలాయిడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి 26న సినిమా ‘ఆహా’ ఓటీటీ ద్వారా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment