టైటిల్: ఛాంగురే బంగారు రాజా
నటీనటులు: కార్తీక్ రత్నం, గోల్డీ నిస్సీ, సత్య, రవిబాబు తదితరులు
నిర్మాణ సంస్థ: ఆర్‌టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్
నిర్మాత: రవితేజ
దర్శకత్వం: సతీశ్ వర్మ
సంగీతం: కృష్ణ సౌరభ్
సినిమాటోగ్రఫీ: సుందర్ NC
విడుదల తేది: సెప్టెంబర్ 15, 2023
కథేంటి?
అనకాపల్లి దగ్గర్లోని ఓ పల్లెటూరిలో బంగార్రాజు (కార్తీక్ రత్నం) బైక్ మెకానిక్. అదే ఊరి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మంగ(గోల్డీ నిస్సీ)ని ప్రేమిస్తుంటాడు. ఓ సందర్భంలో రంగు రాళ్ల విషయమై సోము నాయుడు (రాజ్ తిరందాసు)-బంగార్రాజుకి గొడవ జరుగుతుంది. తర్వాత రోజే సోము నాయుడు శవమై కనిపిస్తాడు. దీంతో ఆ నేరం బంగార్రాజుపై పడుతుంది. ఇంతకీ సోము నాయుడిని చంపిందెవరు? ఈ స్టోరీలో తాతారావు (సత్య), గాటీ (రవిబాబు) పాత్రేంటి? చివరకు ఏమైందనేదే 'ఛాంగురే బంగారు రాజా' స్టోరీ.
(ఇదీ చదవండి: Ramanna Youth Review: ‘రామన్న యూత్’ మూవీ రివ్యూ)
ఎలా ఉందంటే?
సింపుల్‌గా చెప్పుకుంటే ఈ సినిమా లైన్.. ఓ హత్య, దాని వెనక మిస్టరీ. తనపై మోపిన నేరం వెనుక దాగి ఉన్న నిజాన్ని నిగ్గు తేల్చాలనుకున్న ఓ యువకుడి స్టోరీ ఇది. ఈ తరహా కథలు తెలుగులో ఇప్పటికే చాలా వచ్చాయి. వస్తూనే ఉన్నాయి. ఇలాంటి థ్రిల్లర్ కాన్సెప్ట్ తో సినిమా తీస్తున్నప్పుడు.. ఆడియెన్స్ ని ఎంతవరకు థ్రిల్ చేశారు? లేదా ఎంత నవ్వించారు? అనే పాయింట్స్ మీద సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. 'ఛాంగురే బంగారు రాజా' విషయంలో డైరెక్టర్ కి పాస్ మార్కులే వేయొచ్చు. ఎందుకంటే సినిమాలో కామెడీ తప్పితే ఒక్కటంటే ఒక్క సీన్ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించదు. క్లైమాక్స్ ముందు ఓ ఛేజింగ్ సీన్ చూస్తున్నప్పుడు.. అప్పటికీ మూవీ ల్యాగ్ అయిన అనుభూతి వస్తుంది.
అయితే కొత్త దర్శకుడు కావడం వల్ల దీన్ని పూర్తిస్థాయి సినిమాగా తీయడంలో దర్శకుడు తడబడ్డాడు. సినిమాని ఓ సంఘటన, మూడు చాప్టర్లు అని ముందే చెప్పేసిన దర్శకుడు.. ప్రేక్షకుల‍్ని ఎంటర్‌టైన్ చేయడంలో మాత్రం కొంతవరకు మాత్రమే సఫలం అయ్యాడు. ఎందుకంటే ఆ పార్ట్స్ అన్నీ కూడా పెద్దగా కొత్తగా ఏం ఉండవు. మళ్లీ మళ్లీ అవే సీన్స్ చూసిన ఫీలింగ్ వచ్చింది.
మంచి కామెడీ, సెంటిమెంట్, థ్రిల్ కలిగించడానికి సినిమాలో స్కోప్ ఉన్నా సరే రైటింగ్ లో బలం లేకపోవడంతో ఆ సన్నివేశాలన్నీ డల్ గా అలా వెళ్తుంటాయి. సత్య, రవిబాబు కామెడీతో పాటు సునీల్ గొంతుతో వినిపించే కుక్క సీన్స్ నవ్విస్తాయి. ఫస్టాఫ్‌లో సత్య లవ్ స్టోరీ కూడా నవ్వులు పూయిస్తుంది. సెకండాఫ్‌లో రవిబాబు ఎంట్రీ తర్వాత సినిమా ఫన్‌వేలో ముందుకు సాగుతుంది. మతిమరుపుతో రవిబాబు పండించిన కామెడీ వర్కౌట్ అయింది. హీరోని చంపేందుకు ఓ వ్యక్తి ఎందుకు ప్రయత్నిస్తున్నాడనేది చివరి వరకు చెప్పకుండా ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాడు. దర్శకుడు కొత్త నేపథ్యంతో కథను చెప్పాడు కానీ.. దాన్ని మరింత బలంగా రాసుకొని ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. మిగతా విషయాల గురించి పక్కనబెడితే రంగురాళ్ల కాన్సెప్ట్ కాస్త కొత్తగా అనిపించింది.
ఎవరెలా చేశారు?
కేరాఫ్ కంచరపాలెం, నారప్ప తదితర సినిమాల్లో కార్తీక్ రత్నం.. నటుడిగా తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఏ యాక్టర్ కి అయినా సరైన పాత్రలు పడితే అతడిలో సత్తా బయటకొస్తుంది. ఈ మూవీలో కార్తీక్ ఓకే అనిపించాడు. లవ్ సీన్స్ లో ఎమోషన్, నేరం మోపిన సీన్స్ లో సింపతీ వర్కౌట్ కాలేదు. సత్య, రవిబాబు.. తమ కామెడీ టైమింగ్ చూపించి ఫలితం లేకుండా పోయింది. అయితే టెక్నికల్ విషయాలకొస్తే... సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. ఎడిటింగ్ కి ఇంకా పనిచెప్పాల్సింది. ఆర్‌టీ టీమ్ వర్క్స్ & ఫ్రేమ్ బై ఫ్రేమ్ పిక్చర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి.
-రేటింగ్: 2.75
(ఇదీ చదవండి: రతిక.. నా కొడుకుని వాడుకుంది:పల్లవి ప్రశాంత్ పేరెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment