కమెడియన్ గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా శివానీ ఆర్ట్స్, పీఎస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం నా మాటే వినవా. శ్రీనివాస్ యాదవ్, పి వినయ్ కుమార్ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి నంది అవార్డు గ్రహీత వేముగంటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కృష్ణ సరసన కిరణ్ చేత్వాణి హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మేకర్లు మొదలుపెట్టారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన టీజర్‌ను విడుదల చేశారు.
‘పెళ్లి తరువాత బేదాభిప్రాయాలతో విడిపోవడం కన్నా.. పెళ్లికి ముందు మనం ఒక అండర్‌స్టాండింగ్‌కు రావడం మంచిదని నా ఆలోచన’ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగ్‌తో టీజర్ మొదలవుతుంది. మనిద్దరం ఒకే రూంలో ఉంటున్నామని హీరోయిన్ అనడం..కానీ మనం వయసులో ఉన్నాం.. కొంచెం కష్టమంటూ హీరో కొంటెగా చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఇక చివర్లో సాయి కుమార్ చెప్పిన ‘ఆధునికత మంచిదే కానీ నాగరికతను మరిచిపోకూడదు.. వాయిస్ నాది చాయిస్ మీది’ డైలాగ్స్ సినిమాలోని ఎమోషన్‌ను తెలియజేస్తోంది. రొమాన్స్, యాక్షన్, యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇలా అన్ని వర్గాలను అలరించేలా మా చిత్రం ఉటుందని మేకర్స్ తెలిపారు. మహవీర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Comments
Please login to add a commentAdd a comment