
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది.ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని తెలుగు తెరపై చూపించబోతున్నారట జయ శంకర్.
‘నిర్మాతల ప్రొత్సాహంతో షూటింగ్ దిగ్విజయంగా ముగించాం. జౌట్‌పుట్ చాలా బాగొచ్చింది. కామెడీ వేలో ఓ సరికొత్త అంశాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. ఈ మూవీ కచ్చితంగా నాకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తాం’అని దర్శకుడు జయశంకర్ అన్నారు. కాగా, ఈ చిత్రానికి ‘అరి’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment