jayashakar
-
ఢిఫరెంట్ కాన్సెప్ట్‌తో అనసూయ కొత్త చిత్రం.. టైటిల్ ఇదేనా!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సాయి కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో బిజీగా ఉంది.ఇంతవరకు ఎవరూ టచ్ చేయని పాయింట్‌ని తెలుగు తెరపై చూపించబోతున్నారట జయ శంకర్. ‘నిర్మాతల ప్రొత్సాహంతో షూటింగ్ దిగ్విజయంగా ముగించాం. జౌట్పుట్ చాలా బాగొచ్చింది. కామెడీ వేలో ఓ సరికొత్త అంశాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం. ఈ మూవీ కచ్చితంగా నాకు పెద్ద విజయాన్ని అందిస్తుంది. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తాం’అని దర్శకుడు జయశంకర్ అన్నారు. కాగా, ఈ చిత్రానికి ‘అరి’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
అనసూయ కొత్త చిత్రం: శ్రీనివాస్‌రెడ్డి, చమ్మక్ చంద్రల ట్రాక్ హైలెట్!
‘పేపర్ బాయ్’ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో అనసూయ భరద్వాజ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. డిఫరెంట్ కాన్సెఫ్ట్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్నారు. సాయికుమార్, వైవా హర్ష, అక్ష పర్థసాని, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.అనుప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత శేషు మారంరెడ్డి మాట్లాడుతూ...జయశంకర్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కిస్తున్నాడని కొనియాడారు. ఇప్పటికే 80 శాతం షూటింగ్ పూర్తయిందని, మిగిలిన భాగాన్ని ఏప్రిల్‌లోపు కంప్లీట్ చేస్తామని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్రకు సంబంధించిన సీన్స్‌ని దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించాడని, థియేటర్స్‌లో ఆ సీన్స్ తప్పకుండా నవ్వులు పూయిస్తాయని చెప్పారు. జయశంకర్ వర్కింగ్ స్టెల్ చాలా బాగుందని, అందుకే ఆయనతో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. ఇక దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ.. నిర్మాతల ప్రొత్సాహంతో సినిమాను అద్బుతంగా తెరకెక్కిస్తున్నామని చెప్పారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందన్నారు. టైటిల్‌తో పాటు విడుదల తేదిని కూడా త్వరలోనే వెల్లడిస్తామని జయశంకర్ చెప్పుకొచ్చారు. కాగా, ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. -
అనసూయ చిత్రానికి అనూప్ సంగీతం.. టైటిల్ ఇదేనా?
గతకొంత కాలంగా కెరీర్ పరంగా కాస్త వెనకబడ్డ అనూప్ రూబెన్స్..‘బంగార్రాజ’తో మళ్లీ పుంజుకున్నాడు. ఈ సినిమా విజయంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించింది. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా క్లిక్ అయింది. దీంతో అనూప్‌కి మళ్లీ వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే కొన్ని చిత్రాలకు సంగీతం అందిస్తున్న అనూప్.. తాజాగా మరో క్రేజీ ప్రాజెక్ట్‌లోకి ఎంటరయ్యాడు. యాంకర్ అనసూయ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఓ సినిమాకు సంగీతం అందించే ఛాన్స్ అందుకున్నాడు. పేపర్ బాయ్, విటమిన్-షి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచుకున్న యంగ్ డైరెక్టర్ జయశంకర్.. ఈ సారి మరో ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఢిపరెంట్ కాన్సెప్ట్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆర్వీ సినిమాస్ బ్యానర్‌పై ఆర్వీ రెడ్డి, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘గ్రహమ్’అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. తర్వలోనే టైటిల్‌ని అధికారికంగా వెల్లడించనున్నారు. తమ చిత్రానికి అనూప్ సంగీతం చాలా ప్లస్ అవుతుందని దర్శకుడు జయశంకర్ పేర్కొన్నారు. -
లాక్ డౌన్ ఆసరా చేసుకుని దారి దోపిడీలు
సాక్షి, పరకాల(జయశంకర్ భూపాలపల్లి) : దారి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పరకాల ఏసీపీ పి.శ్రీనివాస్ తెలిపారు. పరకాల ఏసీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుల అరెస్టుతో పాటు స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లు, ఇతర వస్తువులను ప్రదర్శించారు. ఏసీపీ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ దేశాయిపేటకు చెందిన తనుగుల రాజు, పైడిపల్లికి చెందిన జన్ను అజయ్ ఇద్దరు జల్సాలకు అలవాటు పడి కొంతకాలంగా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. వరుసకు బావబావమరుదులైన వీరిద్దరూ లాక్డౌన్ సమయాన్ని ఆసరాగా చేసుకుని రాత్రి వేళలో ఒంటరిగా వెళ్లే వారిపై నిర్మానుష్య ప్రాంతాల్లో దాడి చేసి సెల్ఫోన్లు ఎత్తుకెళ్లేవారు. ఈ నెల 14వ తేదీ రాత్రి 10 గంటల ప్రాంతంలో ఏదైనా వాహనం కోసం దామెర క్రాస్ వద్ద ఒంటరిగా ఎదురుచూస్తున్న గణేష్ అనే వ్యక్తికి స్కూటిపై వచ్చి లిఫ్ట్ ఇచ్చినట్లే ఇచ్చి పవర్ గ్రిడ్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దాడి చేసి సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారు. అదే రోజు రాత్రి టాటా ఏస్ డ్రైవర్ కోడెపాక కుమారస్వామిపై దాడి చేసి సెల్‌ఫోన్‌తో పాటు వాహనంలోని 6 రాగి మాల్ట్ బస్తాలను అపహరించారు. బాధితుల ఫిర్యాదుతో దామెర పోలీసులు ఊరుగొండ శివారులోని కేఎస్ఆర్ స్కూల్ వద్ద గురువారం నిఘా పెట్టి అనుమానంగా కనిపించిన వీరిద్దరిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా పారిపోయేందుకు యత్నించడంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులుగా తేలడంతో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు నిందితుల నుంచి రూ.24వేల విలువ చేసే సెల్ఫోన్లు, రాగి పిండి బస్తాలు, బ్యాటరీ, దోపిడీకి ఉపయోగించిన హోండా యాక్టివాను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఫిర్యాదు రాగానే స్పందించి 48 గంటల్లో అరెస్టు చేసినందుకు పరకాల రూరల్ సీఐ రమేష్‌కుమార్, ఎస్సై భాస్కర్‌రెడ్డిని అభినందించారు. చదవండి: 50 సార్లు అరెస్ట్ అయ్యింది.. అయినా కూడా -
రాజకీయాల్లో కొత్త పంథా.. ఆవిష్కరించాం
సాక్షి, హైదరాబాద్: ‘రాజకీయాల్లో కొత్త పంథాను ఆవిష్కరించాలనే మా ప్రయత్నం విజయవంతం అయిందనే భావిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం సంక్షేమానికే పరిమితం కాకుండా పింఛన్లు, రైతుబంధు పెంపు, నిరుద్యోగ భృతి లాంటి అంశాలను మేనిఫెస్టోలో చేర్చేలా అధికార పార్టీపై ఒత్తిడి తేవడంలో సఫలీకృతమయ్యాం. ఉద్యమ ఆకాంక్షలు, వెలుగుల ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగాం. ఏడాది కాలంలో రాజకీయంగా ఎంతో నేర్చుకున్నాం. గుణపాఠాల నుంచి వచ్చిన అనుభవాలు మమ్మల్ని మరింత రాటుదేలుస్తున్నాయి. ప్రజలపక్షాన నిలబడేందుకు బలంగా ముందుకెళ్లే తోవ చూపెడుతున్నాయి’అని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత ఎం. కోదండరాం తెలిపారు. టీజేఎస్ ఏర్పాటైన నాలుగు నెలలకే వచ్చిన అసెంబ్లీ ఎన్నికలను దీటుగా ఎదుర్కోలేకపోయామన్నారు. అయితే ఓ రాజకీయ పార్టీగా ఎన్నికల్లో ఎలా పాల్గొనాలో నేర్చుకున్నామని, జూన్‌లో జరిగే ప్లీనరీలో గత కార్యక్రమాలను సమీక్షించుకొని కొత్త ఎజెండాతో ప్రజల ముందుకు వెళ్తామని చెప్పారు. టీజేఎస్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా కోదండరాం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. పార్టీ ప్రస్థానంతోపాటు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి, అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం, రాజకీయాల్లోకి మధ్యతరగతి, యువత రావాల్సిన ఆవశ్యకత లాంటి అంశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ఇంటర్వూ్యలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... కొత్తవారు రాజకీయాల్లో చేరాలి... రాజకీయాలు అనగానే భయపడాల్సిన అవసరం లేదు. మధ్యతరగతికి చెందిన వారు, డిగ్రీలు, పీజీలు లేకుండానే సమాజంలో తమ పద్ధతిలో కార్యక్రమాలు చేపడుతున్న వారు రాజకీయాల్లోకి రావాలి. తమకు జరుగుతున్న అన్యాయంపై 125 మంది నిజామాబాద్ జిల్లా రైతులు లోక్‌సభ ఎన్నికల్లో నామినేషన్లు వేయడం, మహబూబాబాద్ జిల్లాలో ఆదివాసీలు అటవీ హక్కుల చట్టంపై కదలడం దేశ చరిత్రలోనే అపూర్వమైన ఘటనలు. సమస్య ప్రాతిపదికగా కదిలితే ఎన్నికల్లో, రాజకీయాల్లో పైసలు కీలకం కాదని, ప్రత్యామ్నాయ రాజకీయం సాధ్యమని నిరూపించారు. అన్యాయాలను ఎలుగెత్తి చూపాం... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష చాలా బలీయమైనది. సామాజిక, ఆర్థిక దోపిడీలకు వ్యతిరేకంగా నిలబడ్డ తెలంగాణ సమాజం సాధించుకున్న రాష్ట్రంలో రాజకీయంగా మా వంతు పాలుపంచుకోవాలనే ఉద్దేశంతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చినా కుంగిపోలేదు. తెలంగాణ సమాజం కోరుకున్న రాష్ట్రాన్ని సాధించాలనే తపనతోనే పార్టీని ఏర్పాటు చేశాం. అందులో భాగంగా చాలా ప్రజాసమస్యలను ఎజెండాపైకి తీసుకువచ్చాం. ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ఓ మార్గాన్ని నిర్మించగలిగాం. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చూపగలిగాం. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి వైఫల్యం మాకో గుణపాఠం లాంటిది. భవిష్యత్తులో కూడా ప్రత్యామ్నాయ రాజకీయ విధానాలపైనే దృష్టి సారించి ముందుకెళ్తాం. ఆ పార్టీల స్ఫూర్తితో ముందుకు... ప్రజల ఆకాంక్షలకు రాజకీయ దృక్పథం ఇవ్వడం మా బాధ్యత. దాన్ని రాజకీయ పార్టీగా నిర్వర్తించడం పెద్ద సవాలే. రాజకీయమంటే డబ్బు వెదజల్లి మళ్లీ డబ్బు దండుకోవడమే అనే స్వభావంలో కూడా మార్పు రావాలి. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా నైతిక ఆచరణను ఎంచుకొని నిలబడే వాళ్లు తక్కువగానే కనిపిస్తున్నారు. అయినా టీజేఎస్ నైతికత, విలువలతో కూడిన రాజకీయాలే ప్రధాన ఎజెండాగా ఎలాంటి అండదండలు లేకుండానే పెద్ద రాజకీయ శక్తిగా అవతరించిన ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీల స్ఫూర్తితో ముందుకెళ్తాం. ఆయన మాట ఎప్పటికీ గుర్తుంటుంది... రాష్ట్రం ఏర్పడ్డాక దాని నిర్మాణం ప్రజాస్వామ్య స్వరూపం సంతరించుకునేలా చేయడం చాలా కష్టం. దాని కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి ఉంటుందని ఆచార్య జయశంకర్ చెప్పిన మాట ఎప్పటికీ గుర్తుంటుంది. ఆయన ఆశయాలకు భిన్నంగా రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో గెలిచాక కూడా బలాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ ముందుకెళ్తోంది. రాష్ట్రంలో ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి ప్రభుత్వంలో కనిపిస్తోంది. అయితే సంక్షేమ పథకాల అమలే కాకుండా ప్రజాస్వామికంగా వ్యవహరించడం ప్రభుత్వ బాధ్యత. దీన్ని మర్చిపోయి వ్యవహరిస్తే ప్రజలు ఊరుకోరు. ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ప్రజలకుండాలి. ప్రభుత్వాలు ప్రజాస్వామికంగా వ్యవహరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. నేడు టీజేఎస్ ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ జన సమితి (టీజేఎస్) ఆవిర్భావ దినోత్సవం సం దర్భంగా సోమవారం ఉదయం 9 గంటలకు అధ్యక్షుడు కోదండరాం పార్టీ జెండాను ఎగురవేస్తారు. కార్యక్రమాల్లో ఆయనతోపాటు ఇతర నేతలు హాజరవుతారని టీజేఎస్ అధికార ప్రతినిధి, మీడియా కోఆర్డినేటర్ వి.యోగేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ విద్య సంక్షోభం, విద్యార్థుల ఆత్మహత్యలు, విద్యార్థుల పోరాటాలు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ ఉత్సవాలను భారీగా నిర్వహించకుండా స్థానికంగా ఎక్కడికక్కడ పార్టీ జెండాలు ఎగురవేయాలని పార్టీకేడర్‌కు ఇదివరకే కోదండరాం విజ్ఞప్తిచేసిన విషయం తెలిసిందే. -
వనరుల ఖిల్లా జయశంకర్ జిల్లా
భూపాలపల్లి/ములుగు : ఆచార్య జయశంకర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా నిలవనుంది. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, అపారమైన అడవులు, బొగ్గు నిక్షేపాలు, థర్మల్ విద్యుత్ కేంద్రం, కాకతీయుల కాలం నాటి దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, గిరిజన దేవతల జాతర ఇక్కడి ప్రత్యేకత. భౌగోళికంగా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు, గోదావరి నదీతీరం కలిగి ఉండి 20 మండలాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో జిల్లా అవతరించింది. రాష్ట్ర కేబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న స్పీకర్ మధుసూదనాచారి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీర చందూలాల్ ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడం అభివృద్ధికి ఇక తిరుగులేదని చెప్పవచ్చు. సిరులు కురిపించే సింగరేణి భూపాలపల్లి మండలం కాశీంపల్లి గ్రామ సమీపంలో 1983 జూలై 15న అప్పటి ముఖ్యమంత్రి ఎ¯ŒSటీ.రామారావు కేటీకే–1 గని తవ్వకాలను ప్రారంభించారు. అప్పుడు 250 మంది కార్మికులతో బొగ్గు తవ్వకాలను ప్రారంభించారు. ప్రస్తుతం కేటీకే–1, 2, 5, 6, లాంగ్వాల్ భూగర్భగనులు, ఒక ఓపె¯ŒSకాస్ట్ ప్రాజెక్ట్ ఉన్నాయి. కేటీకే–3 భూగర్భగని, కేటీకే ఓసీపీ–2, కేటీకే–5 స్థానంలో లాంగ్వాల్ ప్రాజెక్టు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రారంభం కానున్నాయి. మొత్తం 25 డిపార్ట్మెంట్లతో కలిపి 6,619 మంది కార్మికులు, 171 మంది అధికారులు మొత్తం 6,790 మంది సింగరేణి ఉద్యోగులు, 960 అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్నారు. అపారమైన బొగ్గు నిల్వలు మల్హర్ మండలం తాడిచర్ల నుంచి భూపాలపల్లిలోని కేటీకే–1 ఇంక్లై¯ŒS వరకు, గణపురం మండలంలోని లాంగ్వాల్ ప్రాజెక్ట్ నుంచి మల్యాలపల్లి వరకు, వెంకటాపూర్, పస్రా మండలాల్లో అపార బొగ్గు నిక్షేపాలున్నాయి. కొత్త గనుల తవ్వకాలు చేపట్టేందుకు సింగరేణి రంగం సిద్ధం చేసింది. సూపర్ పవర్ స్టేషన్ కేటీపీపీ గణపురం మండలం చెల్పూరు శివారు కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు(కేటీపీపీ)లో 500, 600 మెగావాట్ల ప్లాంట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిరంతరాయంగా సాగుతోంది. రెండు ప్లాంట్లలో అధికారులు, సిబ్బంది, కార్మికులు సు మారు 3 వేల మంది వరకు పని చేస్తుంటారు. సింగరేణి, కేటీపీపీలతో జిల్లా కేంద్రం పరిశ్రమల ఖిల్లాగా మారింది. బొగ్గు, గోదావరి నీరు, విద్యుత్ ఇక్కడ సమృద్ధిగా లభిస్తుండటంతో భవిష్యత్‌లో మరిన్ని చిన్న తరహా పరిశ్రమలు ఏర్పడనున్నాయి. విస్తీర్ణం, అడవుల్లో ఫస్ట్.. విస్తీర్ణంలో జయశంకర్ జిల్లా అతి పెద్దది. జనాభా తక్కువగా ఉన్నప్పటికీ విస్తీర్ణం 6175.21 చదరపు కిలో మీటర్లు ఉంటుంది. ఇక్కడ అటవీ ప్రాంతం నాలుగు లక్షల హెక్టార్లలో విస్తరించి ఉంది. ములుగు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాలు, ఇటీవల చేరిన భద్రాచలం నుంచి చేరిన వాజేడు, వెంకటాపుం(ఎం), మంథని నియోజకవర్గంలోని కాటారాం, మహదేవపూర్, మల్హల్రావు, ముత్తారం, భూపాలపల్లిలో వేలాది కిలోమీటర్ల మేర అడవులు విస్తరించి ఉన్నాయి. ఆధ్యాత్మిక శోభ జాతర మేడారం : ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క–సారలమ్మ ఈ జిల్లాకు ప్రత్యేకం. మేడారం జాతరను 1967లో దేవాదాయశాఖ ఆధీనంలోకి తీసుకుంది. రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు 1968 నుంచి ప్రభుత్వం ఏర్పాట్లు ఘనంగా చేస్తోంది. జాతరను 1996 జనవరి 1న అప్పటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. నాటి నుంచి ప్రతి ఏటా భక్త జనుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. 2016లో సుమారు కోటి మంది భక్తులు వన దేవతల సన్నిధికి వచ్చారు. కాళేశ్వరం త్రివేణీ సంగమం దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం ఈ జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలువనుంది. గోదావరి నది ఒడ్డున, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలకు అత్యంత దగ్గరలో కాళేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. ఈ దేవాలయానికి మూడు రాష్ట్రాల భక్తులు వస్తుంటారు. ఈ క్షేత్రంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఒకే పానవట్టంపై రెండు శివలింగా లున్నాయి. ఒకటి కాలుడు(యముడు), ముక్తీశ్వరుడిగా(శివుడు) పురాణాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత, ఆదిలాబాద్ నుంచి గోదావరినది, అంతర్వాహిణి నుంచి సరస్వతీ నదులు కలసిన చోట త్రివేణి సంగమంగా విరాజిల్లుతోంది. ఈ మూడు నదులకు పుష్కర కాలంలో మూడుసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పుష్కరాలు నిర్వహించడం మరో విశేషం. పర్యాటక అందాలకు నిలయం వెంకటాపురం మండలం పాలంపేట పరిధిలోని రామప్ప, గోవిందరావుపేట మండలం బుస్సాపూర్ గ్రామ పరిధిలో ని లక్నవరం సరస్సులు నిత్యం పర్యాటకుల రద్దీతో కళకళలాడుతుంటాయి. ఇక్కడి ప్రకృతి రమణీయమైన అందాలను తిలకించడానికి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తూ ఉంటారు. వీటితో పాటు గణపురం మండలంలోని గణపసముద్రం, రేగొండలోని పాండవులగుట్టలు, తాడ్వాయి అడవుల్లోని వనకుటీరాలు, వాజేడు మండలంలోని బొగత జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. జాతీయ రహదారితో రవాణా సులువు సహజ వనరుల ఖిల్లాగా ఉన్న భూపాలపల్లి జిల్లా జాతీయ రహదారితో మరింత అభివృద్ధి చెందనుంది. గుడెపహడ్ నుంచి భూపాలపల్లి మీదుగా కాళేశ్వరం వరకు జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కాటారం నుంచి మహాముత్తారం మీదుగా మణుగూరు, కొత్తగూడెం వరకు జాతీయ రహదారి నిర్మించడానికి ప్రభుత్వం యోచిస్తున్నది. జమ్మికుంట నుంచి భూపాలపల్లి మీదుగా మణుగూరు వరకు రైల్వేలై¯ŒS ఏర్పాటు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. కాళేశ్వరం గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం జరుగుతున్నది. ఇది పూర్తయితే మహారాష్ట్ర, తెలంగాణకు రాకపోకలు సులువై పలువు కానున్నాయి. వ్యవసాయానికి ఇరిగేషన్ దన్ను రామప్ప, లక్నవరం, మల్లూరు ప్రాజెక్టు, గణపసముద్రం కింద వేలాది ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మహదేవ్పూర్, మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తయితే మహదేవపూర్, కాటారం, మల్హల్రావు, మహాముత్తారం మండల పరిధీలో, వెంకటాపురం(ఎ) పాలెం ప్రాజెక్టు, ప్రతిష్టాత్మక దేవాదుల(చొక్కారావు) ప్రాజెక్టు, గోవిందరావుపేట గుండ్లవాగు ప్రాజెక్టు, కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా వేలాది ఎకరాలకు సాగు నీరందుతుంది. ఏటూరునాగారం గోదావరి నదీ పరవాహక ప్రాంతాలు మిరప పంటకు ప్రత్యేకం. మల్హర్ మండలంలో పండించే మిర్చికి అంతర్జాతీయ స్థాయి మార్కెట్లో ప్రాధాన్యత ఉంది. వీటితో పాటు జిల్లాలో వరి, పత్తి, మొక్కజొన్న, కూరగాయ పంటలు ప్రధాన పండిస్తారు. గోదావరి పరివాహక ప్రాంతాలు గోదావరి నది కాటారం మండలం దామెరకుంట వద్ద ప్రారంభం అయి మహదేవపూర్ మండలం అన్నారం, కాళేశ్వరం, అంబట్పల్లి మీదుగా సుమారు 25 కిలో మీట ర్లు ప్రవహించి వాజేడు మండలం సరిహద్దుల నుంచి ఏటూరునాగారం మండలం ముల్లకట్ట వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి మంగపేట మీదుగా భద్రాద్రి జిల్లాలోకి అక్కడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగుపెడుతుంది.