
డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రధాన పాత్రలో ఆనంద్, శ్రీ పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం వన్ బై టు. శివ ఏటూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుండి విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపద్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ట్రైలర్ విషయానికి వస్తే.. హీరోయిన్ శ్రీపల్లవి లుక్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. ఇక ట్రైలర్ చివరిలో తన పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. ఇందులో సాయికుమార్‌ను చాలా పవర్ ఫుల్‌గా చూపించారు. ఎవరైనా మహిళల పై అనుచితంగా ప్రవర్తిస్తే వాళ్ళను శిక్షించే పాత్రలో సాయికుమార్ ఒదిగిపోయారు.
హీరోయిన్ తండ్రిగా కాశీ విశ్వనాథ్ ముఖ్యమైన పాత్ర పోషించారు, కొడుకు ప్రేమను అర్థం చేసుకునే మధ్యతరగతి తండ్రిగా దేవీ ప్రసాద్ కనిపించారు. విజయ భారతి రాసిన ‘నొప్పి తెలియకుండా మనిషిని సక్కగా చేయటానికి నేను డాక్టర్ ని కాదు, రోజుకొకలా హింసించే యమధర్మరాజుని’సాలీడ్ డైలాగ్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. కాగా ఈ మూవీని చెర్రీ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై కరణం శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీని ఏప్రిల్ 22వ తేదీన విడుదల చేయబోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment