నేను లేక‌పోతే ఏమైపోతావో: అవినాష్‌ | Bigg Boss Telugu 4: Bigg Boss Deals To Housemates Over Captaincy Task | Sakshi
Sakshi News home page

బిగ్‌బాస్‌: అన్నింటినీ త్యాగం చేసిన అభిజిత్‌

Published Tue, Oct 13 2020 11:22 PM | Last Updated on Wed, Oct 14 2020 9:11 AM

Bigg Boss Telugu 4: Bigg Boss Deals To Housemates Over Captaincy Task - Sakshi

బిగ్‌బాస్ నేడు ఇంటిస‌భ్యుల‌కు ఆస‌క్తిక‌ర‌మైన టాస్కులు ఇచ్చాడు. అందులో భాగంగా కంటెస్టెంట్లు క‌ష్ట‌మైనా న‌ష్ట‌మైనా స‌రే, టాస్కు గెలిచి తీరాల్సిందేన‌ని హోరాహోరీగా పోరాడుతున్నారు. అయితే దూరంగా ఉందామ‌ని డిసైడ్ అయిన అభిజిత్, మోనాల్ ఒక టీమ్‌లో వ‌చ్చి ప‌డ్డారు. దీంతో వాళ్లిద్ద‌రూ మాట్లాడుకోకుండా ఉండ‌లేక‌పోయారు. అవినాష్ దివికి ఓ లెట‌ర్ ఇచ్చాడు. అయితే అది ల‌వ్ లెట‌ర్ కాకుండా ఫ్రెండ్‌షిప్ లెట‌ర్ కావ‌డం గ‌మ‌నార్హం. కానీ అరియానాకు మాత్రం ద‌గ్గ‌రుండి మేక‌ప్ వేశాడు. చంద్ర‌ముఖిలా ఉండే నువ్వు ఇప్పుడు ఎలా అయ్యావో చూడు అంటూ ఆమెపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాడు. నేటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌లో ఇంకా ఏమేం జ‌రిగాయో చ‌దివేసేయండి..

కిచెన్‌గా మారిన సోహైల్‌ను చిత‌క్కొట్టారు
బిగ్‌బాస్ ఇచ్చిన‌ మార్నింగ్ మ‌స్తీలో సోహైల్ కిచెన్‌గా మారిపోయాడు. దీంతో దొరికిందే ఛాన్స‌ని అంద‌రూ అత‌డిని చ‌పాతీలా రుబ్బుతూ, బోళ్లు తోముతున్న‌ట్లూ సాకులు చెప్తూ చిత‌క్కొట్టేశారు. అవినాష్ బెడ్‌లా మారిపోగా అమ్మ రాజ‌శేఖ‌ర్ అత‌డిపై విశ్రాంతి తీసుకుంటూ ప‌డుకున్నాడు. అఖిల్ వాష్‌రూమ్‌గా మారిపోగా మాస్ట‌ర్ అందులోనే స్నానం, నిద్ర అన్నీ చేస్తూ ఛీ అనిపిస్తూనే న‌వ్వు తెప్పించారు. మోనాల్ తలుపుగా మారిపోగా అంద‌రూ మ‌రోసారి రోబో టాస్కును గుర్తు చేస్తూ డోర్ విరగ్గొట్టేలా విరుచుకుప‌డ్డారు. దివి కాసేపు డ‌స్ట్‌బిన్‌లా చేసింది. (చదవండి: బిగ్‌బాస్‌ : కెప్టెన్‌ పవర్‌తో ఫ్రెండ్‌ని సేవ్‌ చేసిన సోహైల్‌)

దివికి లెట‌ర్ రాసిన అవినాష్‌
అనంత‌రం అవినాష్ ఓ లేఖ రాసి దివికి ఇమ్మ‌ని మాస్ట‌ర్‌కు ఇచ్చాడు. అందులో ఉన్న‌ది చ‌దివిన మాస్ట‌ర్.. నువ్వే ఇచ్చుకో పో అని ఆ లేఖ‌ను ముఖాన కొట్టాడు. దీంతో అత‌డే నేరుగా దివి బెడ్ ద‌గ్గ‌ర‌కు వెళ్లి ఆమె చేతికి కూడా ఇవ్వ‌కుండా బెడ్‌పై పెట్టేసి వెనుదిరిగాడు. అదేమిటా అని ఆమె తెరిచి చూసింది. అందులో దివి, అవి ఫ్రెండ్స్ అని రాసి ఉండ‌టంతో ఓ స్మైల్ ఇచ్చింది, ఆ వెంట‌నే ఫ్రెండ్‌షిప్ గురించి ఓ సాంగ్ కూడా పాడింది. త‌ర్వాత అవినాష్ అరియానా ద‌గ్గ‌ర తేలాడు. ఆమెకు ద‌గ్గ‌రుండి క‌ళ్ల‌కు కాటుక పెడుతూ మేక‌ప్ వేశాడు. నేను లేక‌పోతే ఏమైపోతావో అంటూ క‌బుర్లు చెప్పుకొచ్చాడు. మ‌రోవైపు అభిజిత్ సోహైల్‌కు అంద‌రూ ఇచ్చే స‌ల‌హానే మ‌ళ్లీ గుర్తు చేశాడు. నువ్వు కోపం త‌గ్గించుకుంటే ఇంత మంచోడివా అనిపిస్తది, కాబ‌ట్టి కోపాన్ని కంట్రోల్‌లో ఉంచుకో అని స‌ల‌హా ఇచ్చాడు. (చదవండి: గంగ‌వ్వ‌ను బ‌య‌ట‌కు పంపిన‌ బిగ్‌బాస్‌!)

ఆరోవారం అమీతుమీ కెప్టెన్సీ టాస్క్‌
బిగ్‌బాస్ అమీ తుమీ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఇంటి స‌భ్యుల‌ను రెండు టీమ్‌లుగా విడ‌గొట్టాడు. అరియానా 'రెడ్'‌ టీమ్‌లో అభిజిత్‌, మెహ‌బూబ్‌, లాస్య‌, అవినాష్‌, మోనాల్ ఉండ‌గా అఖిల్ 'బ్లూ' టీమ్‌లో మిగిలిన ఇంటి స‌భ్యులు ఉంటారు. సోహైల్ సంచాల‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తాడు. ఇక ఈ టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్‌ రెండు టీమ్స్‌కు స‌మంగా బంగారు నాణాలు ఇస్తారు. టాస్క్ ముగిసే స‌మ‌యానికి బిగ్‌బాస్‌తో ఎక్కువ డీల్స్ కుదుర్చుకుని ఏ టీమ్‌ ఎక్కువ నాణాలు ఖ‌ర్చుపెడుతుందో వారే గెలుపును సాధించిన‌ట్లు లెక్క‌. గెలిచిన‌ టీమ్ స‌భ్యులే కెప్టెన్సీకి పోటీ ప‌డతారు. (చదవండి: ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌నుకున్నా: అవినాష్‌)

► మొద‌టి డీల్‌: మ‌గ స‌భ్యుడు ఒంటి మీదున్న బ‌ట్ట‌ల‌ను క‌త్తిరించేయాలి. ఇందుకు 10 బంగారు నాణాలు ఇవ్వాలి.
మొద‌ట అఖిల్ బెల్ కొట్ట‌డంతో అత‌ని టీమ్‌లో కుమార్ సాయి ష‌ర్టును ముక్కలు ముక్క‌లుగా క‌త్తిరించేశాడు. కానీ ఆ ష‌ర్టు సోహైల్‌ది కావ‌డంతో ఆయ‌న ఎక్కువ‌గా బాధ‌ప‌డ్డాడు.
రెండో డీల్‌: ఇంటి స‌భ్యుల్లో ఒక‌రు వారికి సంబంధించిన దుస్తుల‌ను, వ‌స్తువుల‌న్నింటినీ బ‌య‌ట‌కు పంపించేయాలి. చెల్లించాల్సిన నాణాలు: 20.
అరియానా మొద‌ట బెల్ కొట్ట‌గా ఆమె టీమ్‌లోని అభిజిత్ ఒంటి మీదున్న బ‌ట్ట‌లు మిన‌హా త‌న‌కు చెందిన‌వి అన్నింటినీ త్యాగం చేశాడు.
► మూడో డీల్‌: అమ్మాయి త‌న జుట్టును మెడ‌పై వ‌ర‌కు క‌త్తిరించుకుని రెడ్ క‌ల‌ర్ వేసుకోవాలి. చెల్లించాల్సిన‌ నాణాలు: 25
అఖిల్‌,గంట కొట్ట‌డంతో హారిక హెయిర్ క‌ట్ చేయించుకునేందుకు రెడీ అయింది. అయితే ఈ షోకు వ‌చ్చేముందే ఇలా హెయిర్ క‌ట్ చేయించుకోవ‌ద్ద‌ని అన్న‌య్య మ‌రీమ‌రీ చెప్పాడ‌ని ఏడ్చేసింది. నోయ‌ల్ జుట్టు క‌త్తిరించేస్తుంటే అన్న‌ను గుర్తు చేసుకుంటూ సారీ చెప్తూ క‌న్నీళ్లు కార్చింది. అయితే వెళ్లిపోయేలోపు త‌న జుట్టు పెరిగేలా మ‌సాజ్ చేసే బాధ్య‌త ఇంటి స‌భ్యుల‌దేన‌ని వారిపై భారం వేసింది.

నాలుగో డీల్‌: ఇసుక మూట‌ను ఒక్క ‌చేత్తో మార్కు కింద‌కు వెళ్ల‌కుండా చూడాలి. బిగ్‌బాస్ త‌దుప‌రి ఆదేశాల వ‌ర‌కు అదే స్థానంలో క‌ద‌ల‌కుండా ఉండాలి. చెల్లించాల్సిన నాణాలు: 20
అఖిల్ టీమ్‌లో కుమార్ సాయి ఈ ఛాలెంజ్ స్వీక‌రించాడు. చాలాసేపు ఒకేచోట ఉండ‌టంతో అత‌నికి నోయ‌ల్ నీళ్లు తాగిపించాడు. కానీ స‌మ‌యం ఎక్కువ‌య్యేకొద్దీ అత‌డు నొప్పి భ‌రించ‌లేక కేక‌లు పెట్టాడు. ఏడ్చినంత ప‌ని చేశాడు. కానీ ఎట్ట‌కేల‌కు ఛాలెంజ్ విజ‌య‌వంతంగా పూర్తి చేశాడు.
► ఐదో డీల్‌: స‌్టోర్ రూమ్ ద్వారా పంపించే వ‌స్తువుల‌తో డ్రింక్ త‌యారు చేసి రెండు గ్లాసులు తాగాల్సి ఉంటుంది. చెల్లించాల్సిన నాణాలు: 20
అరియానా గంట కొట్ట‌డంతో లాస్య ఛాలెంజ్ స్వీక‌రించింది. ముక్కు మూసుకుని రెండు గ్లాసుల‌ను గ‌ట‌గ‌టా తాగేసింది. మా జున్ను కోసం చేశాన‌ని చెప్పుకొచ్చింది. లాస్య‌ కోసం అఖిల్ సాంగ్ పాడి ఆమెను న‌వ్వించాడు.
ఆరో డీల్‌: ఒక ఇంటి స‌భ్యుడు బిగ్‌బాస్ త‌దుప‌రి ఆదేశం వ‌ర‌కు జ్యూట్‌తో అల్లిన బ‌ట్ట‌ల‌ను ధ‌రించాలి. చెల్లించాల్సిన నాణాలు: 20
అఖిల్ క‌న్నా ముందు గంట కొట్టినందుకు అరియానా టాస్క్ గెలిచినంత ఆనందప‌డి గెంతులేసింది. ఇక ఆమె టీమ్‌లోని మోనాల్ జ‌న‌ప‌నార‌తో అల్లిన దుస్తులు ధ‌రించింది. దీంతో మాస్ట‌ర్ ఆమెతో కోయ డ్యాన్స్ వేయించాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement