హారర్‌ కథా చిత్రం | cinema prema katha chitram audio launch | Sakshi
Sakshi News home page

హారర్‌ కథా చిత్రం

Published Fri, Jan 3 2020 2:26 AM | Last Updated on Fri, Jan 3 2020 2:26 AM

cinema prema katha chitram audio launch - Sakshi

షీనారాయ్‌

రుషి లక్ష్మణ్, ఉమేశ్, సాయికుమార్, జాకీష్రాఫ్, షీనారాయ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా కథా చిత్రం’. రామ్‌ఫిలిమ్స్‌ పతాకంపై మదన్‌ మోహన్‌ నాయుడు, జి.తిమ్మారెడ్డి గౌడ్‌ నిర్మించిన ఈ చిత్రానికి రామ్‌ మధుసూదన్‌ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, మోహన్‌ గౌడ్‌లు పాల్గొన్నారు. రామ్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను తెరకెక్కించిన ‘వంశం’ చిత్రానికి 13 అవార్డులు వచ్చాయి. లేటెస్ట్‌గా రుషిని హీరోగా పరిచయం చేస్తూ ‘సినిమా కథా చిత్రం’ చేశాను. హారర్‌ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement